హోమ్ /వార్తలు /national /

రేపు సాయంత్రానికి స్పష్టత... చంద్రబాబుని కలిస్తే తప్పేంటి ?: జానారెడ్డి

రేపు సాయంత్రానికి స్పష్టత... చంద్రబాబుని కలిస్తే తప్పేంటి ?: జానారెడ్డి

సోమవారంనాడు నామినేషన్ దాఖలు చేయనున్న జానా రెడ్డి

సోమవారంనాడు నామినేషన్ దాఖలు చేయనున్న జానా రెడ్డి

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను రేపు సాయంత్రం ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. తాను ఢిల్లీలో చంద్రబాబును కలవడంలో తప్పులేదని ఆయన స్పష్టం చేశారు.

  కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను రేపు సాయంత్రానికి ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియా దుబాయ్ నుంచి రాగానే జాబితాపై ఓ స్పష్టత వస్తుందని తెలిపారు. పొన్నాల లక్ష్మయ్య సీటును క్లియర్ చేశామని జానారెడ్డి...పొత్తుల్లో భాగంగా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం సహజమే అని అన్నారు. సీపీఐకు పొత్తుల్లో భాగంగా మరో సీటు కేటాయించే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడ్డారు.

  బీసీల సీట్లనే పొత్తుల్లో భాగంగా వదిలేస్తున్నామన్న వాదనను జానారెడ్డి తోసిపుచ్చారు. బీసీలకు గతంలో ఇచ్చిన సంఖ్యకు కాస్త అటు ఇటుగానే సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. తాము చంద్రబాబును కలవడంలో తప్పులేదని జానారెడ్డి అన్నారు. చంద్రబాబే తమతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చారని తెలిపారు. అది స్నేహపూర్వక సంబంధం మాత్రమే అన్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ అనవసర రాద్దాంతం సృష్టించి సెంటిమెంట్‌ను రగిలించాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

  గతంలో కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ తనను కలిసేందుకు ఎదురుచూశారని చెప్పుకొచ్చారు. మహాకూటమి గెలిస్తే తెలంగాణ జట్టు చంద్రబాబు చేతిలోకి వెళుతుందన్న టీఆర్ఎస్ ఆరోపణలను జానారెడ్డి ఖండించారు. తెలంగాణ వ్యవహారాల్లో చంద్రబాబు జోక్యాన్ని తాము సహించబోమని అన్నారు. సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆలస్యమవుతుందనే అంశంపై స్పందించిన జానారెడ్డి... దేశంలో ఎక్కడా మూడు నెలల ముందు అభ్యర్థులను ప్రకటించలేదని టీఆర్ఎస్‌ను ఉద్దేశించి అన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Chandrababu Naidu, CM KCR, Congress, CPI, Jana reddy, Kodandaram, Mahakutami, TDP, Telangana, Telangana Election 2018, Trs

  ఉత్తమ కథలు