Home /News /national /

POLITICS JAHANGIRPURI TRAGEDY AMIT SHAH FAILED TO PROTECT CITY DELHI FROM RIOTS SHARAD PAWAR PAH

Jahangirpuri violence: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై, శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..

శరద్ పవార్ (ఫైల్)

శరద్ పవార్ (ఫైల్)

Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ బీజేపీపై విరుచుకుపడ్డారు. జహంగీర్ పుర్ ఘటనను ప్రస్తావిస్తూ.. అల్లర్లను నియంత్రించడంలో అమిత్ షా విఫలమయ్యారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Jahangirpuri violence Sharad pawar comments on Amit Shah: పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో శనివారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. గత హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఢిల్లీలో జహంగీర్ పుర్ లో జరిగిన అల్లర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హోంమంత్రి అమిత్ షా, అల్లర్లను అదుపు చేయడంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. కొన్ని రోజులుగా ఢిల్లీ మతపరమైన గొడవలతో ఉద్రిక్తంగా మారిందన్నారు.

ఢిల్లీని సీఎం కేజ్రీవాల్ పాలిస్తున్నారు. కానీ పోలీసులు కేంద్రం ప్రభత్వం ఆధీనంలో పనిచేస్తున్నాయని అన్నారు. అయినప్పటీకి మతపరమైన అల్లర్లను నియంత్రించడంలో అమిత్ షా విఫలమయ్యారని అన్నారు. ఢిల్లీలో ఏదైన జరగరానిది జరిగితే.. అది ప్రపంచం దృష్టికి వెళుతుందని అన్నారు. అదే విధంగా,శరద్ యాదవ్ హుగ్లీలో చెలరేగిన అల్లర్లపై కూడా బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఒక హోర్డింగ్‌పై మైనారిటీ వర్గాలకు చెందిన దుకాణాలు, వాటి యజమానుల పేర్లు ఉన్నాయని, అలాంటి షాపుల నుంచి వస్తువులు కొనవద్దని దానిపై రాసి ఉందని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇదో సాధారణ చిత్రమని చెప్పారు కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ విమర్శించారు.

యూపీలో యోగి ఆదిత్యనాథ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మిగతా వారికంటే భిన్నంగా ఉంటారనే విషయం అనేక సందర్భాల్లో రుజువైంది.

ఇటీవల రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి.. మరోసారి తనదైన తరహాలో నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనను ముందుకు తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పరిపాలనలో మార్పు తీసుకొచ్చే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా తమకు పోస్టింగ్ వచ్చిన ప్రాంతంలో సరైన సౌకర్యాలు లేకపోతే.. వేరే ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు మొగ్గు చూపుతుంటారు అధికారులు. ఈ రకమైన అధికారులకు సీఎం యోగి సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం ఎక్కడ పోస్టింగ్ ఇస్తుందో అక్కడే ఉండాలని సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు. SDM, CO, తహసీల్దార్ నుండి ఇతర అధికారుల వరకు పోస్టింగ్ ఇచ్చిన స్థలంలోనే ఉండాలని స్పష్టం చేశారు. ఒకవేళ అక్కడ అధికారుల కోసం ప్రభుత్వ వసతి లేకపోతే అద్దెకు ఇల్లు తీసుకునైనా అక్కడే ఉండాలని ఆదేశించారు. ప్రజాసమస్యలను వెంటనే వినాలని సూచించిన సీఎం యోగి.. ఇందుకోసం అధికారులు తప్పనిసరిగా కార్యాలయంలో ఉండాలని అన్నారు. దీనితో పాటు వారి మొత్తం సమయం విస్తరణ సైట్‌లో ఉండాలని అన్నారు.

SDM, తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్, CO వారి పోస్టింగ్ ఇచ్చిన ప్రాంతంలోనే రాత్రి బస చేయాలని పేర్కొన్నారు. కారణం లేకుండా ఏ అధికారి కూడా ప్రధాన కార్యాలయానికి వెళ్లకూడదని స్పష్టం చేశారు. అధికారులు తమకు పోస్టింగ్ ఇచ్చిన ప్రాంతాల్లో ఉంటేనే పౌరుల సమస్యలు వెంటనే వారికి చేరుతాయని.. తద్వారా అవి త్వరగా పరిష్కరించబడతాయని అన్నారు. అధికారులు, ఉద్యోగులు అందరూ వేరే ప్రాంతాల్లో ఉండొద్దని ముఖ్యమంత్రి యోగి అన్నారు. ఈ విషయంలో అధికారులు ఏ రకమైన నిర్లక్ష్యం చేయకూడదని కామెంట్ చేశారు
Published by:Paresh Inamdar
First published:

Tags: Amit Shah, Maharashtra, Sharad Pawar

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు