ప్రధాని జస్టిన్ ట్రూడో (Prime Minister of Canada Justin Trudeau)కు చెందిన లిబరల్ పార్టీ (Liberal Party) మళ్లీ కెనడాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తాజాగా జరిగిన జనరల్ ఎలక్షన్స్‌లో ఆ పార్టీ విజయకేతనం ఎగర వేయనున్నట్లు కెనడా (Canada)కు చెందిన మీడియా సంస్థలు చెబుతున్నాయి. అయితే కన్జర్వేటివ్ (Conservative) పార్టీ నుంచి తీవ్ర పోటి ఉన్నా.. ట్రూడో (Trudeau)నే మళ్లీ ఆ దేశ ప్రధాని (Prime Minister) కానున్నారు. కాగా, ఈ ప్రభుత్వ ఏర్పాటులో ఇండియన్ కెనడియన్ (Indian-Origin Canadian) అయిన జగ్మీత్ సింగ్ (Jagmeet Singh) కీలక పాత్ర పోషించనున్నారు. ఆయన నేతృత్వంలోని న్యూ డెమొక్రాటిక్ పార్టీ (New Democratic Party) 24 సీట్లు గెలుచుకుని ‘కింగ్ మేకర్’గా అవతరించింది. అయితే, 2015 నాటి ఎన్నికల కన్నా ఈ సారి ఆ పార్టీ గెలిచిన స్థానాల సంఖ్య తగ్గింది. ఆ ఎన్నికల్లో ఎన్‌డీపీ 44 సీట్లు గెల్చుకుంది.
మెజారిటీ ఎంత..?
ఎరిన్ ఓ టూలే (Erin O'Tool) నేతృత్వంలో కన్జర్వేటివ్ పార్టీ పోటీలోకి దిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో 338 స్థానాల్లో లిబరల్ పార్టీ ఇప్పటివరకు 158 సీట్లు గెలిచింది. కన్జర్వేటివ్ పార్టీ 119 సీట్లు సాధించింది. అయితే మెజారిటీ కావాలంటే 170 సీట్లు సాధించాల్సిందే. కెనడాలోని తూర్పు ప్రాంతాల్లో పోలింగ్ ముందుగా ముగిసింది. పశ్చిమ ప్రాంతాల్లో పోలింగ్ ఆల్యస్యంగా ముగిసింది.ప్రధాని జస్టిన్ ట్రూడో తన పార్లమెంటరీ సీటును గెలుచుకున్నారు. పాపినియో స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. సొంత జిల్లాకు వెళ్లి ట్రూడో (Trudeau) ఓటేశారు. పోల్ వర్కర్లను మెచ్చుకుంటూ ప్రధాని తన ట్విట్టర్‌లో కొన్ని ఫోటోలు పోస్టు చేశారు.
Thank you, Canada — for casting your vote, for putting your trust in the Liberal team, for choosing a brighter future. We're going to finish the fight against COVID. And we're going to move Canada forward. For everyone.
— Justin Trudeau (@JustinTrudeau) September 21, 2021
బ్లాక్ క్యూబెకాయిస్ 32, గ్రీన్ పార్టీ 3 సీట్లు గెలుపొందాయి. బ్లాక్ క్యూబెకాయిస్, గ్రీన్ పార్టీ ట్రూడో ప్రభుత్వంలో చేరబోమని ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ట్రూడోకు మరో 12 మంది సభ్యుల మద్దతు అవసరం. పార్లమెంట్‌లో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని, కెనడియన్ల హక్కుల కోసం పోరాడుతామని ఈ ఎన్నికల ఫలితాల అనంతరం జగ్మీత్ సింగ్ ((Jagmeet Singh)) వ్యాఖ్యానించారు. కెనడాలోని ఒక రాజకీయ పార్టీకీ నేతృత్వం వహిస్తున్న తొలి శ్వేతజాతీయేతర నేత 40 ఏళ్ల జగ్మీత్ సింగ్ ((Jagmeet Singh))నే కావడం విశేషం. ఈ ఎన్నికల ప్రచారంలో ఎన్‌డీపీ తరఫున ప్రధాని అభ్యరి్థగా నిలిచిన జగ్మీత్ సింగ్ గతంలో క్రిమినల్ డిఫెన్స్ లాయర్‌గా పనిచేశారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ట్రూడో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎరిన్ కూడా విజయం..
ఇక ప్రత్యర్థి కన్జర్వేటివ్ నేత ఎరిన్ కూడా తన పార్లమెంట్ స్థానంలో విజయం సాధించారు. ఓంటారియోలోని దుర్హమ్ నుంచి ఆయన పోటీ చేశారు. ఎన్నికలకు ముందు ట్రూడో తన ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేశారు. పది డాలర్లకే చైల్డ్ కేర్, చౌకైన ఇళ్లు, ఆయుధాలపై నిషేధం, గ్రీన్ జాబ్స్, నర్సులు, డాక్టర్లు, మహిళలకు రక్షణ కావాలంటే లిబరల్ పార్టీకి ఓటు వేయాలని ట్రూడో ఆ ట్వీట్‌లో కోరారు.
వ్యతిరేకత ఉన్నా..
కెనడా ప్రజలు ప్రగతిశీల అజెండాకు ఓటేశారని ఫలితాల అనంతరం ట్రూడో వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్న ట్రూడో ఈ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వ్యతిరేకతను చవిచూడాల్సి వచ్చింది. ఒక ఎన్నికల ర్యాలీలో ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌తో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్యూబెక్, అల్బెర్టా తదితర ప్రావిన్స్‌ల్లో ఆయన నేతృత్వంలోని లిబరల్ పార్టీ భారీగా దెబ్బ తిన్నది. ట్రూడో ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదని కన్సర్వేటివ్ పార్టీ నేత షీర్ వ్యాఖ్యానించారు. మరోసారి ఎన్నికలు వస్తే తమదే విజయమన్నారు. 2.74 కోట్ల ఓటర్లున్న కెనడాలో 65% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్ల 97 మంది మహిళలు గెలిచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Canada, Modi, Narendra modi, Politics, Results