హోమ్ /వార్తలు /national /

చెంచాగిరి చాలు... ఆ పని చేసి చూపించు.. మంత్రి తలసానికి జగ్గారెడ్డి సవాల్

చెంచాగిరి చాలు... ఆ పని చేసి చూపించు.. మంత్రి తలసానికి జగ్గారెడ్డి సవాల్

జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీపై నోరు పరేసుకుంటే ఇక చూస్తూ ఉరుకొమని జగ్గారెడ్డి హెచ్చరించారు.

మంత్రి తలసానిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. తలసానికి హైదరాబాద్‌లో పహిల్వాన్లు ఉన్నారేమో.. తమకు రాష్ట్రమంతా ఉన్నారని అన్నారు. తలసాని ప్రజల కోసం కాకుండా కేసీఆర్ కుటుంబం, ఆయన కుటుంబం కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. కరోనా వైద్యం కోసం ఆరోగ్యశ్రీకి రూ. 10 వేల కోట్లు మంజూరు చేయించి తానేంటో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ప్రజల కోసం చేయాలనుకుంటే గాంధీ హాస్పిటల్‌కి కేసీఆర్‌తో మాట్లాడి రూ. 3 వేల కోట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. తలసాని టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్, హరీష్ రావుని ఉరికించి కొడతానని అన్నారని... ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఉండి చంద్రబాబును ఉరికించి కొడతా అన్నారని విమర్శించారు. ఏ పార్టీలో ఉంటే వారికి చెంచాగిరి చేయడం ఆయనకు అలవాటు అని మండిపడ్డారు.


ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీపై నోరు పరేసుకుంటే ఇక చూస్తూ ఉరుకొమని జగ్గారెడ్డి హెచ్చరించారు. తలసాని కుటుంబంలో ఎవరికైనా కరోనా వచ్చి ప్రాణ నష్టం జరిగితే అప్పుడు ప్రజల బాధ ఏంటో తెలుస్తుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తున్నట్టు జీవో రాకపోతే హైదరాబాద్‌లో ఒక రోజు దీక్ష చేస్తానని అన్నారు. దీక్ష చేసిన స్పందించకపోతే హైద్రాబాద్ కేంద్రంగా రోజు ఒక కార్యక్రమం చేస్తానని హెచ్చరించారు. కేసీఆర్ కొత్త సచివాలయం కేవలం తన నిషాని కోసం కట్టిస్తున్నాడని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ఇందుకోసం ప్రజల డబ్బు రూ. 500 కోట్లు వృధా చేస్తున్నారని అన్నారు.

First published:

Tags: Jaggareddy, Talasani Srinivas Yadav, Telangana

ఉత్తమ కథలు