Home /News /national /

POLITICS JAGDEEP DHANKHAR ELECTED INDIAS NEXT VICE PRESIDENT DEFEATS MARGARET ALVA HERE DETAILS NS

Vice President: బిగ్ బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ కర్ ఘన విజయం

ఉప రాష్ట్రపతి

ఉప రాష్ట్రపతి

ఉప రాష్ట్రపతిగా ఎన్టీఏ అభ్యర్థి జగదీప్ ధన్ కర్ విజయం సాధించారు. ఈ రోజు నిర్వహించిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections 2022) ఎన్టీఏ అభ్యర్థి జగదీప్ ధన్ కర్ కు మొత్తం 528 ఓట్లు వచ్చాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India
    ఉప రాష్ట్రపతిగా ఎన్టీఏ (NDA) అభ్యర్థి జగదీప్ ధన్ కర్ (Jagdeep Dhankar) విజయం సాధించారు. ఈ రోజు నిర్వహించిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections 2022) ఎన్టీఏ అభ్యర్థి జగదీప్ ధన్ కర్ కు మొత్తం 528 ఓట్లు వచ్చాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన మార్కరెట్ ఆళ్వాకు 182 ఓట్లు వచ్చాయి. ఎన్టీఏ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన ధన్ కర్ వెంకయ్యనాయుడు స్థానంలో 14వ భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ (TRS), ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP), ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా, మజ్లిస్‌, సమాజ్ వాదీ వంటి పార్టీలు మద్దతును తెలిపాయి. ఇక జేడీయూ, వైసీపీ (YSTCP), బీఎస్పీ (BSP), ఏఐఏడీఎంకేశివసేన తదితర పార్టీలు ఎన్టీఏ అభ్యర్థి అయిన జగదీప్ ధన్ కర్ కు తమ మద్దతు ప్రకటించాయి. ఈ లెక్కల ప్రకారం ఎన్‌డీయే అభ్యర్థి ధన్‌కఢ్‌కు 515కు పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి.

    అయితే.. ధన్ కర్ కు విశ్లేషకుల అంచానకు మించి 528 ఓట్లు పోల్ కావడం విశేషం. జగ్‌దీప్‌ ధన్‌కర్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన గోకల్‌చంద్‌, కేసరి దేవి దంపతులకు జన్మించారు. ఆయన రాజస్థాన్‌ రాష్ట్రంలోని కితానా గ్రామంలో మే 18, 1951న జన్మించారు. ఆయన తన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కితానా గ్రామంలోనే పూర్తి చేశారు. అనంతరం చితోర్‌ఘర్‌ సైనిక స్కూళ్లో చేరారు. ధన్ కర్ రాజస్థాన్‌ యూనివర్సీటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆయన భార్య పేరు సుదేశ్‌ ధన్‌కర్‌. ఈ దంపతులకు ఓ కుమార్తె ఉన్నారు.
    Vice President of India: భారత ఉపరాష్ట్రపతి జీవితం ఎలా ఉంటుంది? జీతం ఎంత? సౌకర్యాలేంటి?

    సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జగ్‌దీప్‌ ధన్‌కర్‌ లాయర్‌గా, క్రీడాకారుడిగా, రాజకీయ నాయకుడిగా రాణించారు. సుప్రీంకోర్టు అడ్వొకేట్‌గా కూడా పని చేసి మంచి పేరు సాధించారు.1989-91 మధ్య కాలంలో జున్‌జున్‌ నియోజక వర్గం నుంచి జనతాదళ్ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికై విధులు నిర్వహించారు. రాజస్థాన్‌ లోని కిషన్‌గంజ్‌ నుంచి 1993-98 మధ్య ఎమ్మెల్యేగా పని చేశారు. 1990లో ఆయనకు కేంద్రమంత్రి వరించింది. 2019 నుంచి బెంగాల్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ధన్ కర్.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Vice President Elections 2022

    తదుపరి వార్తలు