హోమ్ /వార్తలు /national /

Three Capitals: మూడు రాజధానులకు బ్రేక్..! సీఎం పంద్రాగస్టు ప్రసంగంలో లేని ప్రస్తావన

Three Capitals: మూడు రాజధానులకు బ్రేక్..! సీఎం పంద్రాగస్టు ప్రసంగంలో లేని ప్రస్తావన

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

మూడు రాజధానుల అంశానికి బ్రేక్ పడిందా..? ఇక అమరావతి నుంచే పాలించాలని జగన్ ఫిక్స్ అయ్యారా.? పంద్రాగస్టు వేడుకల్లో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు..?

  ముహూర్తం ఫిక్స్.. నేడో రేపో రాజధానుల పై అధికారిక నిర్ణయం.. విశాఖ నుంచి త్వరలో జగన్ పరిపాలన.. గత కొన్ని రోజుల నుంచి ఏ మంత్రి నోట చూసినా ఇదే మాట. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి వచ్చిన తరువాత.. ఈ ప్రచారం ఎక్కువైంది. దసరా నాటికి విశాఖ నుంచి పాలన అంటూ ఇప్పటికే మంత్రులు అంతర్గత సమావేశాల్లో చెబుతూ వస్తున్నారు. క్యాంప్ ఆఫీసు కూడా ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరిగింది. కానీ గత వారం రోజుల నుంచి పరిస్థితి చూస్తుంటే అందుకు భిన్నంగా కనిపిస్తోంది. తాత్కాలికంగా మూడు రాజధానులకు బ్రేకు పడినట్టు కనిపిస్తోంది. తాజాగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాత్రంత్య దినోత్సవ వేడుకల ప్రసంగంలోనూ సీఎం జగన్ ఆ ప్రస్థావన తేవకపోవడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. జాతీయ జెండాను ఆవిష్కరించి.. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ఏమేం చేసింది..? అనేదానితో పాటు పలు విషయాలపై నిశితంగా మాట్లాడారు. ముఖ్యంగా.. ఉద్యోగుల సంక్షేమం గురించి ప్రత్యేకించి మరీ తన ప్రసంగంలో జగన్ మాట్లాడారు. గతంలో పలు సభల్లో, సమావేశాల్లో, పంద్రాగస్టులో కూడా మూడు రాజధానుల గురించి జగన్ చాలా సార్లే ప్రస్తావించారు. అయితే.. ఈ పంద్రాగస్టు ప్రసంగంలో మాత్రం మూడు రాజధానుల ప్రస్తావనే అస్సలు కనిపించలేదు. ఆయన ఎందుకు ఈ ప్రస్తావన తీసుకురాలేదు..? మరిచిపోయారా..? లేకుంటే ప్రతిసారీ మాట్లాడుతున్నాం కదా.. అని తేలిగ్గా తీసుకున్నారా..? అసలు ఇప్పట్లో కుదరని దాని గురించి మాట్లాడి ఏ లాభం అనుకున్నారా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది..

  తాజా ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన లేకపోవడంపై రాజకీయ విశ్లేషకులు విభిన్న వాధనలు వినిపిస్తున్నారు. పదే పదే చెప్పాల్సిన అవసరం ఏముందని కొందరు అంటున్నారు. అయితే కావాలనే జగన్ మాట్లాడలేదు. ప్రస్తుతం మూడు రాజధాను అంశం కోర్టు పరిధిలో ఉందని.. ఆ అడ్డంకులు దాటే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఇప్పట్లో అది సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చి ఉంటారని అంటున్నారు. మరోవైపు ఏపీలోని తీరప్రాంతాలకు పెను ముప్పు పొంచి ఉందని నాసా అధ్యయనాలు చెబుతున్నాయి ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు అంటున్నారు. దానికి తోడు ప్రస్తుతం కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గ్యాప్ బాగా పెరిగిందని.. ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని.. ఇలాంటి సమయంలో రాజధాని మార్పు పేరుతో సెల్ప్ గోల్ వేసుకోవడం ఎందుకని ఉంటారని మరికొందరు అంచనా వేస్తున్నారు..

  జగన్ ప్రసంగం సంగతి ఎలా ఉన్నా.. ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇక నుంచి సచివాలయానికి ప్రతి పది రోజులుకూ వస్తానని చెప్పారు. ఇప్పటి వరకూ తాడేపల్లి క్యాంపు కార్యాయం నుంచి జగన్ పరిపాలన సాగించారు. అయితే ఇటీవలకాలంలో సచిలవాలయంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉన్నతాధికారుల తీరు మారిందని.. కొందరు సచివాలయం వైపు కన్నెత్తి చూడడం లేదని గ్రహించిన సీఎం.. ఈ నిర్ణయం తీసుకున్నారని.. అందరూ తప్పక సచివాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సచివాలయానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే జగన్ కూడా ఇక అమరావతే రాజధాని అని ఫిక్స్ అయ్యారా అనే అనుమానాలు పెరుగుతున్నాయి..

  తాజాగా కేంద్ర ప్రభుత్వం సమాధానం కూడా అలానే అనిపించింది. మూడు రాజధానుల అంశంపై సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన దరఖాస్తుకు కేంద్ర హోం శాఖ సమాధానం చెప్పింది. ఆ అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని.. అందుకే సమాచారం ఇవ్వలేమని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. దరఖాస్తును అప్పిలేట్ అథారిటీకి పంపుతున్నట్టు తెలిపింది. ఇలా ఈ పరిణమాలు చూస్తుంటే మూడు రాజధానుల నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap capital, Ap cm jagan, AP News, Independence Day

  ఉత్తమ కథలు