హోమ్ /వార్తలు /national /

MLA Roja: రోజా చిరకాల కోరిక తీరడం కష్టమేనా ?.. ప్రత్యర్థులు అలా ప్లాన్ చేస్తున్నారా ?

MLA Roja: రోజా చిరకాల కోరిక తీరడం కష్టమేనా ?.. ప్రత్యర్థులు అలా ప్లాన్ చేస్తున్నారా ?

AP Politics: రోజాను ఆమె ప్రత్యర్థులు ఈ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారంటే.. ఆమెకు మంత్రి పదవి దక్కడం కూడా కష్టమేనేమో అని కొందరు చర్చించుకుంటున్నారు.

AP Politics: రోజాను ఆమె ప్రత్యర్థులు ఈ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారంటే.. ఆమెకు మంత్రి పదవి దక్కడం కూడా కష్టమేనేమో అని కొందరు చర్చించుకుంటున్నారు.

AP Politics: రోజాను ఆమె ప్రత్యర్థులు ఈ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారంటే.. ఆమెకు మంత్రి పదవి దక్కడం కూడా కష్టమేనేమో అని కొందరు చర్చించుకుంటున్నారు.

  రాజకీయాల్లో రాణించడం అంత తేలికైన విషయమేమీ కాదు. అందులోనూ మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు చాలానే శ్రమించాల్సి ఉంటుంది. ఏపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా.. అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని రాజకీయాల్లో నిలదొక్కుకున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజా.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి కావాలని భావించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో రోజా కోరిక నెరవేరలేదు. అయితే రెండున్నరేళ్ల తరువాత మళ్లీ కొత్తవారికి మంత్రులుగా అవకాశం ఇస్తానని జగన్ అప్పట్లోనే చేసిన ప్రకటనతో.. తనకు రెండో విడతలో అమాత్యయోగం ఉంటుందని రోజా ఆశించారు. ఇప్పటికీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో తనకు సీఎం జగన్ మంత్రి పదవి ఇస్తారని భావిస్తున్నారు రోజా.

  అయితే మారుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తుంటే.. రోజా మంత్రి పదవిపై ఆశలు వదులుకోవాల్సిందేనా ? అనే చర్చ మొదలైంది. రాజకీయాల్లోని నేతలకు ప్రత్యర్థి వర్గాలు ఉండటం సహజం. అయితే వైసీపీ ఎమ్మెల్యే రోజా మాత్రం విపక్షాల్లోని ప్రత్యర్థుల కంటే ఎక్కువగా సొంత పార్టీలోని ప్రత్యర్థులతోనే రాజకీయంగా పోరాడుతున్నారు. నియోజకవర్గంలోని తన ప్రత్యర్థులకు వైసీపీలోని బలమైన నేతల అండదండలు ఉండటం కూడా రోజాకు మింగుడుపడని అంశం.

  అందుకే ఈ విషయంలో ఎప్పటికప్పుడు రోజా తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. అయితే కొద్దిరోజులుగా ఎమ్మెల్యే రోజా వైసీపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారని.. ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారనే ఊహాగానాలు వినిపించడం మొదలయ్యాయి. అయితే ఇలాంటి ఊహాగానాలను ఎవరూ పట్టించుకోవద్దని రోజా క్లారిటీ ఇచ్చారు.

  Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ సీఎం జగన్‌ను కలవకపోవడానికి కారణం ఆయనేనా ?

  Chiranjeevi: చిరంజీవి ఏమీ ఆషామాషీ వ్యక్తి కాదు.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

  అయితే రోజాను ఆమె ప్రత్యర్థులు ఈ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారంటే.. ఆమెకు మంత్రి పదవి దక్కడం కూడా కష్టమేనేమో అని కొందరు చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి రోజాకు వైసీపీ తరపున టికెట్ దక్కకుండా పార్టీలోని ఆమె ప్రత్యర్థి వర్గం ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అంతకంటే ముందు ఆమెకు రెండో విడతలో ఎలాగైనా మంత్రి పదవి దక్కకుండా చేయాలన్నది వారి ప్లాన్ అనే చర్చ జోరుగా సాగుతోంది.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, MLA Roja

  ఉత్తమ కథలు