హోమ్ /వార్తలు /national /

రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్... జగన్‌ది వ్యూహాత్మక తప్పిదమా ?

రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్... జగన్‌ది వ్యూహాత్మక తప్పిదమా ?

రఘురామకృష్ణంరాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

రఘురామకృష్ణంరాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

వైసీపీలో ఇప్పుడు రఘురామకృష్ణంరాజు వర్సెస్ సీఎం జగన్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది.

  రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే చాలా చిన్న విషయాలు కూడా అప్పుడప్పుడు చిక్కులు తెచ్చిపెడుతూ ఉంటాయి. తాజాగా సొంత పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో సీఎం జగన్ సరైన వ్యూహం లేకుండా ముందుకు సాగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. రఘురామకృష్ణంరాజుకు వైసీపీ ఇచ్చిన షోకాజ్ నోటీసుతో ఆ పార్టీ ఇప్పుడు ఎటువంటి స‌మాధానం చెప్పలేని స్థితిలోకి వెళ్లిపోయింది. అస‌లు రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సి అవ‌స‌రం ఎందుకొచ్చింద‌నే వాదనలు ఇప్పుడు సొంత పార్టీలోనే వినిపిస్తోన్నాయి.

  వైసీపీలో ఇప్పుడు రఘురామకృష్ణంరాజు వర్సెస్ సీఎం జగన్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఈ కారణంగా రఘురామకృష్ణంరాజు చాలామంది నోళ్లలో నానుతున్నారు. ఈ వివాదం కారణంగా ఆయన గోదావ‌రి జిల్లా స్థాయి నేత నుంచి రాష్ట్ర స్థాయి నేత‌గా మారిపోయారనే టాక్ వినిపిస్తోంది. దీని వల్ల రఘురామకృష్ణంరాజుకు వచ్చే ఇబ్బందేమీ ఉండదని... మహా అయితే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే వాదన ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ విషయాన్ని సాగదీసే కొద్ది ఆయనకు అనవసరపు ప్రచారం కల్పించనట్టు అవుతుందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఈ వివాదం పెద్దది కాకముందే సీఎం జగన్ రఘురామకృష్ణంరాజుకు అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

  ఒకవేళ సీఎం జగన్ అపాయంట్‌మెంట్ లభించిన తరువాత కూడా ఆయన ఇదే రకమైన విమర్శలు చేసి ఉంటే... ఆయన రహస్య ఎజెండాతో పని చేస్తున్నారని అనే అవకాశం వైసీపీకి లభించేది. కొన్ని విషయాల్లో దూకుడుగా ముందుకు సాగడం కంటే వ్యూహాత్మకంగా ముందుక సాగాల్సి ఉంటుందని... కేంద్రంలో బీజేపీకి దగ్గరవుతున్న రఘురామకృష్ణంరాజు విషయంలోనూ ఆయన ఈ రకంగా వ్యవహరిస్తే బాగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తం రఘురామకృష్ణంరాజు వ్యవహారాన్ని సాగదీయడం వల్ల వైసీపీకి ఇబ్బందే అనే ప్రచారం సాగుతోంది.

  ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్‌18

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, MP raghurama krishnam raju, Ysrcp

  ఉత్తమ కథలు