హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Anand Sharma : కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి ఆనంద్ శర్మ! -జేపీ నడ్డాతో భేటీ..

Anand Sharma : కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి ఆనంద్ శర్మ! -జేపీ నడ్డాతో భేటీ..

రాహుల్ గాంధీతో ఆనంద్ శర్మ (పాత ఫొటో)

రాహుల్ గాంధీతో ఆనంద్ శర్మ (పాత ఫొటో)

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ సంచలన చర్యకు పాల్పడ్డారు. సోనియాపై తిరుగుబాటు చేసి, రాజ్యసభ ఎంపీగా కొనసాగే అవకాశం కోల్పోయిన ఆనంద్ శర్మ.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.

జాతీయ కాంగ్రెస్ పార్టీ (Congress)కి మరో భారీ షాక్ తగలనుందా? పార్టీ పని తీరుపై, సోనియా గాంధీ(Sonia Gandhi) నాయకత్వంపై సవాళ్లు చేసిన జీ-23 నేతలు ఒక్కొక్కరుగా జారుకోబోతున్నారా? అంటే జరుగుతోన్న పరిణామాలను బట్టి అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ (Anand Sharma) సంచలన చర్యకు పాల్పడ్డారు. సోనియాపై దాదాపు తిరుగుబాటు చేసి, మరోసారి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగే అవకాశం కోల్పోయిన ఆనంద్ శర్మ.. బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)తో సమావేశం కావడం కలకలం రేపింది. వివరాలివే..

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో గురువారం సాయంత్రం ఆనంద్‌ శర్మ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆనంద్‌ శర్మ బీజేపీలో చేరడంపై చర్చ జరిగినట్టు తెలిసింది. వీరిద్దరూ హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవారు కావడం విశేషం. అలాగే త్వరలో హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేతలిద్దరూ సమావేశం కావడంతో ఆనంద్‌ శర్మ పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది.

Advocate Rachana Reddy : బీజేపీలోకి ఫైర్‌బ్రాండ్! -బండితో అడ్వొకేట్ రచనా రెడ్డి చర్చలు..


నడ్డాతో భేటీలో హిమాచల్ ప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై ఆనంద్ శర్మ చర్చించినట్టు సమాచారం. కాగా... ఆనంద్‌ శర్మ పార్టీ మారడంపై ఊహాగానాలు వెలువడటం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. ఆయన హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. గత మే నెలలో పదవీకాలం ముగిసింది. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయన్ను మళ్లీ రాజ్యసభకు పంపలేదు. దీంతో ఆనంద్‌ శర్మ నడ్డాను కలిశారని, పార్టీ మారతారని అప్పట్లోనే ప్రచారం జరిగింది.

Vastu Expert : ప్రముఖ వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్య.. ఆస్తి కోసం శిష్యులే..


నడ్డాతో భేటీ, పార్టీ మార్పు వార్తలపై ఆనంద్‌ శర్మ వివరణ ఇచ్చారు. ప్రస్తుతానికైతే తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, పార్టీలు వేరైనంత మాత్రాన నడ్డాను శత్రువుగా ఉండాల్సిన అవసరం లేదన్నారు. తామిద్దరిదీ ఒకే రాష్ట్రమని, ఒకేచోట చదువుకున్నామని చెప్పారు. అందువల్ల తాను నడ్డాను కలవాలనుకుంటే రహస్యంగా వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరగడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయన్నారు. తమ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో టాప్ 10 నేతల్లో ఒకరిగా ఉన్న ఆనంద్ శర్మ.. బీజేపీ చీఫ్ ను కలవడంపై హైకమాండ్ లేదా ఏఐసీసీ స్పందించాల్సి ఉంది.

Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Congress, Himachal Pradesh

ఉత్తమ కథలు