హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bengaluru vs Hyderabad: బెస్ట్ సిటీ ఏది? KTR - DK Shivakumar మధ్య ఛాలెంజ్

Bengaluru vs Hyderabad: బెస్ట్ సిటీ ఏది? KTR - DK Shivakumar మధ్య ఛాలెంజ్

హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు పోటీ నెలకొంటోన్న తరుణంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మధ్య ట్విటర్ వేదికగా ఛాలెంజ్ ఏర్పడింది. పూర్తి వివరాలివే..

హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు పోటీ నెలకొంటోన్న తరుణంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మధ్య ట్విటర్ వేదికగా ఛాలెంజ్ ఏర్పడింది. పూర్తి వివరాలివే..

హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు పోటీ నెలకొంటోన్న తరుణంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మధ్య ట్విటర్ వేదికగా ఛాలెంజ్ ఏర్పడింది. పూర్తి వివరాలివే..

బీజేపీపై విమర్శల క్రమంలో ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ది కుటుంటుపడిందని, మత మౌఢ్యం కారణంగా పెట్టుబడిదారులు ఇబ్బందులు పడుతున్నారని టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ తరచూ విమర్శించడం తెలిసిందే. ఐటీ, ఇతర వ్యాపార రంగాల్లో బెంగళూరుకు పోటీగా, ధీటుగా హైదరాబాద్ ఎదుగుతోందని కూడా గులాబీ నేతలు చెప్పుకోవడం విదితమే. సోషల్ మీడియాలో కొన్ని సార్లు హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు పోటీ నెలకొంటోన్న తరుణంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మధ్య ట్విటర్ వేదికగా ఆసక్తికర చర్చ జరిగింది..

బెంగుళూరులో మౌళిక స‌దుపాయాలు స‌రిగా లేవ‌ని కొన్ని రోజుల క్రితం ఖాతాబుక్ సీఈవో రవీశ్ నరేశ్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఫిర్యాదు చేశారు. స్టార్టప్ ల ద్వారా భారీ పన్నులు రాబడుతున్నా కనీసం మంచి రోడ్లు వేయడంలేదంటూ రవీశ్ వాపోయారు. దానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ బదులిస్తూ.. ‘మీరంతా హైద‌రాబాద్‌కు రావొచ్చు అని, ఇక్క‌డ ఉత్త‌మ స‌దుపాయాలున్నాయి.. ఇన్నోవేష‌న్‌, ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, ఇంక్లూజివ్ గ్రోత్‌పై మేం దృష్టి పెట్టాం’అని కేటీఆర్.. ఖాతాబుక్ సీఈవోకు బదులిచ్చారు.

Zodiac Signs: కిటికీ లేని గదిలో ఏ రాశివారు ఏం చేస్తారో తెలుసా? మీ రియాక్షన్ చెక్ చేసుకోండి

ఖాతాబుక్ సీఈవోకు కేటీఆర్ ఇచ్చిన బదులుపై తాజాగా క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ స్పందించారు. బీజేపీ పాలనలో బెంగళూరు ప్రతిష్ట దిగజారిందని ఒప్పుకుంటూ ‘కేటీఆర్.. మీ ఛాలెంజ్‌ను స్వీక‌రిస్తున్నా. 2023లో క‌ర్నాట‌క‌లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంది. మ‌ళ్లీ బెంగుళూరుకు పూర్వ ఐటీ వైభవాన్ని తీసుకురానున్నాం’అని శివకుమార్ పేర్కొన్నారు.

Cooking Oil: విమాన ఇంధనంగా వంట నూనె - Airbus A380 తొలి ప్రయాణం సక్సెస్

కర్ణాటక కాంగ్రెస్ నేత శివకుమార్ ఛాలెంజ్ ట్వీట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. ‘శివ‌కుమార్ అన్నా.. క‌ర్నాట‌క రాజ‌కీయాల గురించి అంత‌గా తెలీదు. అక్క‌డ ఎవ‌రు గెలుస్తారో చెప్ప‌లేను. కానీ మీరు విసిరిన స‌వాల్‌ను స్వీక‌రిస్తున్నా. దేశ యువ‌త, సౌభాగ్యం కోసం ఉద్యోగాల క‌ల్ప‌న ద్వారా హైద‌రాబాద్‌, బెంగుళూరు న‌గ‌రాల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ ఉండాల‌ని మేం అభిలాషిస్తున్నాం’అని కేటీఆర్ అన్నారు. మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, ఐటీ, బీటీల‌పై ఫోక‌స్ పెడుదాం కానీ హ‌లాల్‌, హిజాబ్ లాంటి అంశాల‌పై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు. బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్-టీఆర్ఎస్ బడా నేతలు ట్విటర్ వేదికగా ఛాలెంజ్ లు చేసుకోవడం చర్చనీయాంశమైంది.

First published:

Tags: Bengaluru, Bjp, Congress, Dk shivakumar, Hyderabad, Karnataka, KTR, Telangana, Trs

ఉత్తమ కథలు