హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Modi Birthday: ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన క్రీడాకారులు.. ఎవరెవరు ఎలా విష్ చేశారంటే..

Modi Birthday: ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన క్రీడాకారులు.. ఎవరెవరు ఎలా విష్ చేశారంటే..

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

71వ పుట్టినరోజు (Birthday) సందర్భంగా ప్రపంచ దేశాల ప్రధానమంత్రులు (Prime ministers), అధిపతులు.. మోదీకి శుభాకాంక్షలు (wishes) తెలిపారు. వీరితో పాటు భారత క్రీడాకారులు (Sports persons) సైతం ప్రధానికి ట్విట్టర్‌లో బర్త్‌డే విషెస్ (Birthday wishes) చెప్పారు. వీరిలో బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) నుంచి ఇటీవల ఒలింపిక్స్‌లో తొలి పతకం నెగ్గిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను (Mirabhai chanu) వరకు ఎంతోమంది స్పోర్ట్స్‌స్టార్స్ ఉన్నారు.

ఇంకా చదవండి ...

నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime minister Narendra Modi) పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తలు, నాయకులు తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు తెలియజేశారు. 71వ పుట్టినరోజు (Birthday) సందర్భంగా ప్రపంచ దేశాల ప్రధానమంత్రులు (Prime ministers), అధిపతులు.. మోదీకి శుభాకాంక్షలు (wishes) తెలిపారు. వీరితో పాటు భారత క్రీడాకారులు (Indian Sports persons) సైతం ప్రధానికి ట్విట్టర్‌ (Twitter)లో బర్త్‌డే విషెస్ (Birthday wishes) చెప్పారు. వీరిలో బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) నుంచి ఇటీవల ఒలింపిక్స్‌లో తొలి పతకం నెగ్గిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను (Mira Bhai chanu) వరకు ఎంతోమంది స్పోర్ట్స్‌స్టార్స్ ఉన్నారు. తమ ట్వీట్‌ (Tweets)లో మోదీని ట్యాగ్ చేస్తూ వీరు శుభాకాంక్షలు తెలిపారు.

ఎందరికో స్ఫూర్తి అంటూ సైనా..

‘ప్రియమైన నరేంద్ర మోదీ సర్.. మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు విశిష్ట లక్షణాలతో జన్మించిన నాయకులు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచినందుకు మీకు ధన్యవాదాలు' అని సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది.

మోదీ జీ సేవ చేస్తూనే ఉండాలి..

గౌరవనీయులైన ప్రధాని నరేంద్రమోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యం, సంతోషంతో ఆశీర్వదించబడాలి.  దేశానికి సేవ చేస్తూనే ఉండండి” అంటూ భారత మాజీ క్రికెట్​ ప్లేయర్​ వీవీఎస్​ లక్ష్మణ్​ శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు ఆయనతో చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటోను ట్విటర్​లో పంచుకున్నారు.

సంతోషంతో నిండిన సంవత్సరం కావాలి..

‘‘గౌరవనీయులు PM నరేంద్రమోదీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు,  మంచి ఆరోగ్యం, సంతోషంతో నిండిన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను”అని భారత మాజీ క్రికెటర్​ సచిన్​ టెండూల్కర్​ అన్నారు.

దేశం పట్ల మీ అంకిత భావమే స్ఫూర్తి..

‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. దేశం పట్ల మీ అంకితభావం, దృష్టి మాకు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటాయి. మీరు దీర్ఘాయువుతో ఆరోగ్యకరమైన జీవితం గడపాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేసింది భారత వెయిట్ లిఫ్టర్, ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను.

మీరు అథ్లెట్లను ప్రోత్సహించారు..

‘ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మాకు అన్నివిధాలుగా మీరు అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు. కొన్ని సందర్భాల్లో మీతో ఇంటరాక్ట్ అయ్యే గౌరవం నాకు లభించింది. మీరు భారత అథ్లెట్లకు మద్దతుగా ఉంటూ ప్రోత్సహించారు. మీరు ఆరోగ్యకరమైన, సంపన్నమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేసింది టెన్నిస్ ప్లేయర్ అంకిత రైనా (Ankita Raina).

‘పుట్టినరోజు శుభాకాంక్షలు సర్.. నరేంద్ర మోదీ జీ’ అని ట్వీట్ చేసింది భారత అథ్లెట్ స్వప్న బర్మన్ (Swapna Barman).

* నేడు మోదీ 71వ పుట్టినరోజు. గుజరాత్‌లో 1950 లో జన్మించిన నరేంద్ర మోదీ.. చిన్న వయసులోనే హిందూత్వ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) లో చేరారు. ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపికైన మోదీ, అప్పటి నుంచి ఓటమి అన్నదే తెలియకుంగా ప్రతి ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగరవేస్తున్నారు. సొంత రాష్ట్రంలో బీజేపీని వరుసగా మూడు పర్యాయాలు అధికారంలోకి తీసుకువచ్చారు. ఆ తరువాత జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి 2014, 2019లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు.

మోదీ 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నుంచి బీజేపీ "సేవ అండ్ సమర్పన్" పేరుతో 20 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనుంది. ప్రజా జీవితంలోకి మోదీ ప్రవేశించి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా, 20 రోజుల పాటు.. అంటే అక్టోబర్ 7 వరకు పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నందు వల్ల కార్యకర్తలు అందరూ వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేలా ప్రచారం చేయాలని పార్టీ కోరింది.

Published by:Prabhakar Vaddi
First published:

Tags: Birthday, Games, Narendra modi, Sports, Tweets

ఉత్తమ కథలు