హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పాక్ అదుపులో వైమానిక దళ పైలట్ అభినందన్.. ధ్రువీకరించిన భారత్..

పాక్ అదుపులో వైమానిక దళ పైలట్ అభినందన్.. ధ్రువీకరించిన భారత్..

IAF Pilot Abhinandan Varthaman in Pak Custody : పైలట్ అభినందన్ పాక్ అదుపులో ఉన్న నేపథ్యంలో.. 'BringBackAbhinandan','Abhinandan' హాష్ ట్యాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. భారత పైలట్ పాకిస్తాన్‌కు పట్టుబడటంపై దేశంలోని విపక్షాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇంకా చదవండి ...

  భారత ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ అదుపులో ఉన్నాడని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ధ్రువీకరించారు. పట్టుబడ్డ తమ పైలట్‌ను వీడియోల ద్వారా అభ్యంతరకరంగా చూపించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.మొదట ఆయనపై దాడి చేసినట్టుగా ఓ వీడియో.. ఆపై ఆయనకు 'టీ' ఇచ్చి మర్యాదపూర్వకంగా మాట్లాడినట్టు మరో వీడియో వైరల్‌గా మారాయి. యుద్ద ఖైదీ పట్ల పాకిస్తాన్ ఇలా వ్యవహరించడం జెనీవా ఒప్పందానికి తూట్లు పొడవడమే అని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పట్టుబడ్డ భారత వైమానిక దళ పైలట్ క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించింది.

  పాకిస్తాన్ అదుపులో ఉన్న తమ పైలట్‌కు ఎలాంటి హాని తలపెట్టరాదని, ఆయన్ను వీలైనంత త్వరగా వెనక్కి పంపించాలని భారత్ ఒక స్టేట్‌మెంట్ ద్వారా కోరింది. భారత ఎయిర్‌ఫోర్స్ అప్రమత్తంగా ఉండటం వల్ల పాక్ పన్నాగాన్ని విజయవంతంగా తిప్పికొట్టగలిగామని చెప్పింది. కాగా, భారత పైలట్ పాకిస్తాన్‌కు పట్టుబడటంపై దేశంలోని విపక్షాలు కూడా ఆవేదన వ్యక్తం చేశాయి.

  ఈ క్లిష్ట సమయంలో మనమంతా సాయుధ బలగాలకు అండగా నిలబడుదాం. పట్టుబడ్డ మన పైలట్‌కి ఎలాంటి హామీ కలగకుండా క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాను.
  రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

  డీఎంకె అధినేత ఎంకె స్టాలిన్ మాట్లాడుతూ పట్టుబడ్డ మన వైమానిక దళ పైలట్‌ను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి అవసరమైన చర్యలన్నింటిని తీసుకోవాలని అన్నారు. వైమానిక దళ పైలట్ అభినందన్ పాక్ అదుపులో ఉన్న నేపథ్యంలో.. 'BringBackAbhinandan','Abhinandan' హాష్ ట్యాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

  First published:

  Tags: Imran khan, India VS Pakistan, Jammu and Kashmir, Kashmir security, Narendra modi, Pulwama Terror Attack

  ఉత్తమ కథలు