హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bihar Elections: బీద బీహార్‌లో ఇంతమంది కోటీశ్వరులైన అభ్యర్థులు పోటీ చేస్తున్నారా?

Bihar Elections: బీద బీహార్‌లో ఇంతమంది కోటీశ్వరులైన అభ్యర్థులు పోటీ చేస్తున్నారా?

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

చాన్నాళ్లుగా బీహార్‌ రాజకీయాల్లో అంగబలం, అర్థబలం ప్రధానపాత్ర పోషిస్తోంది. నిర్మాణ రంగాల్లో ఉన్నవారు, ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన వారు, లీజులు నిర్వహిస్తున్న వారు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

  2013లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఓ నివేదిక ప్రకారం బీహార్ రాష్ట్రంలో 33.74 మంది పేదరికంలో మగ్గుతున్నారు. ఇలాంటి బీద బీహార్‌లో వచ్చే బుధవారం జరగనున్న మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మాత్రం కోటీశ్వరులు ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం మొదటి విడుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1064 మంది అభ్యర్థుల్లో 375 మంది అభ్యర్థులు కోటీశ్వరులు ఉన్నారు. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు కోటీశ్వరులు అన్నమాట. ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు వారు ఈసీకి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం 375 మంది కనీస ఆస్తి రూ.కోటి కంటే ఎక్కువే. ఈ కోటీశ్వరులు కూడా పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకు చెందిన వారే. బీహార్‌లో అధికార జనతాదళ్ యునైటెడ్ తరఫున తొలి దశ ఎన్నికల్లో 35 మంది పోటీ చేస్తున్నారు. వారిలో 31 మంది కోటీశ్వరులు ఉన్నారు. వారి సగటు ఆస్తి రూ.8.12 కోట్లు. అలాగే, జేడీయూతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ తొలి దశలో 29 మందిని బరిలోకి దించింది. వారిలో 24 మంది కోటీశ్వరులు ఉన్నారు. వారి సగటు ఆస్తి రూ.3.10 కోట్లు.

  ప్రతిపక్షాల సంగతి చూస్తే రాష్ట్రీయ జనతాదళ్ కూడా కోటీశ్వరులకు టికెట్లు ఇచ్చింది. ఆర్జేడీ తరపున పోటీ చేస్తున్న 42 మందిలో 39 మంది శ్రీమంతులు ఉన్నారు. వారి సగటు ఆస్తి రూ.6.98 కోట్లు. ఆ జాబితాలో అత్యంత ధనవంతుడు ఆర్జేడీకి చెందిన అనంత్ సింగ్. డాన్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన అనంత్ సింగ్ ఉపా చట్టం కింద ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మోకామా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అనంత్ సింగ్ తనకు రూ.68 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. అనంత్ సింగ్ తర్వాత అత్యంత ధనవంతుడు కాంగ్రెస్ అభ్యర్థి గజానంద్ షాహి. ఆయనకు రూ.61 కోట్లు ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. షేక్‌పుర జిల్లాలోని బార్‌బీగా నియోజకవర్గం నుంచి గజానంద్ షాహి పోటీ చేస్తున్నారు.

  అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం 11 శాతం మంది అభ్యర్థులు తమ PAN నెంబర్ కానీ, ఆదాయపన్ను రిటర్నుల వివరాలు కానీ ఇవ్వలేదు. 5 శాతం మంది తమకు రూ.95 లక్షల ఆస్తులు ఉన్నాయని చెప్పారు. అయితే, వారు ఐటీ రిటర్న్స్ చూపించలేదు.

  బీహార్‌ను శాసిస్తున్న అంగబలం, అర్థబలం

  చాన్నాళ్లుగా బీహార్‌ రాజకీయాల్లో అంగబలం, అర్థబలం ప్రధానపాత్ర పోషిస్తోంది. నిర్మాణ రంగాల్లో ఉన్నవారు, ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన వారు, లీజులు నిర్వహిస్తున్న వారు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అనంత్ సింగ్ సీఎం నితీష్ కుమార్‌కు సన్నిహితంగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున మాల్స్, సినిమా హాళ్లు నిర్మాణంలో డబ్బు గడించారు. మనోరమాదేవి భర్త దివంగత బింది యాదవ్ అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించారు. ఏకంగా నక్సల్స్‌కు తుపాకులు సరఫరా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

  రామా సింగ్ అనే మరో కోటీశ్వరుడు ఉన్నారు. ఆయన లోక్ జనశక్తి పార్టీ మాజీ ఎంపీ. ఆయన ప్రభుత్వ కాంట్రాక్టులు పొంది పెద్ద ఎత్తున డబ్బు సంపాదించారు. ఇటీవల కన్నుమూసిన లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశవాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రామాసింగ్ భార్య బీనా దేవి ఆర్జేడీ టికెట్ మీద వైశాలి జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Bihar Assembly Elections 2020, Bjp, JDU, Nitish Kumar

  ఉత్తమ కథలు