హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

బడ్జెట్ 2019 : నిర్మలా బ్యాగ్‌పై చిదంబరం కామెంట్.. భవిష్యత్‌లో అలా చేస్తారట..

బడ్జెట్ 2019 : నిర్మలా బ్యాగ్‌పై చిదంబరం కామెంట్.. భవిష్యత్‌లో అలా చేస్తారట..

ఆర్థికమంత్రి పి.చిదంబరం(File)

ఆర్థికమంత్రి పి.చిదంబరం(File)

నేడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. బడ్జెట్ పద్దులను ఓ ఎర్రటి జూట్ బ్యాగ్‌లో తీసుకొచ్చారు. దాన్ని బహీఖాతా అని పిలుస్తారు. దానిపై రాజముద్ర కూడా ఉంది. నిర్మలా చేతిలో ఆ బ్యాగ్ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా కనిపించింది.

బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు ఆర్థికశాఖ మంత్రులు బ్రీఫ్ కేసుతో పార్లమెంటుకు రావడం మనందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆ సాంప్రదాయానికి స్వస్తి పలికి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. నేడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. బడ్జెట్ పద్దులను

ఓ ఎర్రటి జూట్ బ్యాగ్‌లో తీసుకొచ్చారు. దాన్ని బహీఖాతా అని పిలుస్తారు. దానిపై రాజముద్ర కూడా ఉంది. నిర్మలా చేతిలో ఆ బ్యాగ్ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా కనిపించింది. ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర ఆర్థికమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం దీనిపై స్పందించారు.

భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. తమ ఆర్థికమంత్రి ఐపాడ్‌తోనే బడ్జెట్‌ను ప్రవేశపెడుతాడని చిదంబరం అన్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై స్పందిస్తూ చిదంబరం ఈ కామెంట్ చేశారు.చిదంబరం కామెంట్ ఇలా ఉంటే ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు మాత్రం నిర్మలా సీతారామన్ తీసుకొచ్చిన ఆ బ్యాగ్.. ఇన్నాళ్ల మన బానిసత్వానికి స్వస్తి పలికిందని అన్నారు. పాశ్చాత్య బానిసత్వానికి స్వస్తి పలికి భారతీయ

సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఆమె బహీఖాతాతో వచ్చారని అన్నారు.

First published:

Tags: Budget 2019 highlights, Chidambaram, Union Budget 2019

ఉత్తమ కథలు