హోమ్ /వార్తలు /national /

కేసీఆర్ లాజిక్ ప్రకారం.. తెలంగాణలో ఆర్టీసీ విలీనం అయినట్టే.. రేవంత్ రెడ్డి

కేసీఆర్ లాజిక్ ప్రకారం.. తెలంగాణలో ఆర్టీసీ విలీనం అయినట్టే.. రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)

‘ఆర్టీసీ విభజన జరగకపోతే సంస్థ ఒకటిగానే లెక్క. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే..అది తెలంగాణలో కూడా చెల్లుబాటు అవుతుంది’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

  ఆర్టీసీ సమ్మెకు సంబంధించి కేసీఆర్ చెప్పిన లెక్కల ప్రకారం.. తెలంగాణలో కూడా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయినట్టేనని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆర్టీసీ ఆస్తులు, అప్పులు విభజన జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై సకల జన భేరిలో రేవంత్ రెడ్డి స్పందించారు. ‘ఆర్టీసీ అస్తులు, అప్పులు విభజన జరగలేదని కేసీఆర్ అంటున్నారు. విభజన జరగకపోతే ఏపీలో విలీనం తెలంగాణలో కూడా చెల్లుబాటు అవుతుంది. ఆస్తులు, అప్పులు విభజన జరగకపోతే సంస్థ ఒక్కటే కదా. ఒకే కుటుంబం కింద లెక్క. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే.. తెలంగాణలో కూడా ఆర్టీసీ విలీనం కిందే లెక్క. అది తెలంగాణలో కూడా అమలు చేయాల్సిందే.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

  రేపు 24 గంటల దీక్ష..

  ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని ఉధృతం చేసేందుకు గురువారం మధ్యాహ్నం నుంచి 24గంటల దీక్ష చేయాలని భావిస్తున్నారు. ఆర్టీసీ యూనియన్ల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు గమ్యాన్ని కచ్చితంగా చేరుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. గట్టి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులు సకలజనుల సమ్మెలో లేకపోతే తెలంగాణ చరిత్ర లేదని స్పష్టం చేశారు. 26 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం.. కార్మికులను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి మద్దతు పలికిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. అవసరమైతే మరో మిలియన్ మార్చ్‌కు పిలుపునిస్తామని ప్రకటించారు.

  బైక్ స్టంట్స్‌తో నవ్వులు.. అంతలోనే భయంతో అరుపులు

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: CM KCR, Revanth reddy, RTC Strike, Telangana, TSRTC Strike

  ఉత్తమ కథలు