హోమ్ /వార్తలు /national /

దుబ్బాక ఉపఎన్నికలో పోటీపై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి

దుబ్బాక ఉపఎన్నికలో పోటీపై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి

విజయశాంతి (ఫైల్ ఫోటో)

విజయశాంతి (ఫైల్ ఫోటో)

దుబ్బాక ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, కర్ణం శ్రీనివాస్‌తో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు టికెట్ ఆశిస్తున్నారు. తాను పోటీచేయనని విజయశాంతి స్పష్టం చేయడతో కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది

ఇంకా చదవండి ...

  దుబ్బాక ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. రామలింగారెడ్డి మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బరిలోకి దిగుతున్నారు. బీజేపీ నుంచి పోటీచేస్తున్న రఘునందన్ రావు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. ఐతే కాంగ్రెస్ నుంచి విజయశాంతి బరిలోకి దిగుతున్నారన్న ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బలమైన నేతలను రంగంలోకి దించాలన్న ఉద్దేశంతో విజయశాంతికి పార్టీ హైకమాండ్ టికెట్ దాదాపు ఖరారు చేసిందన్న వార్తలు షికారు చేస్తున్నారు. ఈ క్రమంలో దుబ్బాక ఉపఎన్నికల్లో పోటీపై విజయశాంతి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

  ఇటీవల పార్టీ రాష్ట్ర పెద్దలు విజయశాంతికి ఫోన్ చేసినట్లు సమాచారం. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఒకవేళ మీరు పోటీచేయాలనుకుంటే టికెట్ మీకే కేటాయిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఐతే దుబ్బాకలో తాను పోటీచేయనని పార్టీ నేతలకు విజయశాంతికి స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. స్థానికంగా ఉండే ప్రచార కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నేతలతో పాటు ఢిల్లీ పెద్దలకు విజయశాంతి సూచించినట్లు సమాచారం. మరో వైపు దుబ్బాక ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, కర్ణం శ్రీనివాస్‌తో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు టికెట్ ఆశిస్తున్నారు. తాను పోటీచేయనని విజయశాంతి స్పష్టం చేయడతో కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

  2018 డిసెంబర్‌లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దుల నాగేశ్వరరెడ్డి పోటీ చేశారు. రామలింగారెడ్డికి 89,299 ఓట్లు వచ్చాయి. నాగేశ్వరరెడ్డికి 26,799 ఓట్లు వచ్చాయి. 62,500 ఓట్ల తేడాతో రామలింగారెడ్డి విజయం సాధించారు. అయితే, కొన్ని రోజుల క్రితం రామలింగారెడ్డి హఠాన్మరణం చెందారు. దీంతో దుబ్బాకలో ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బరిలో దిగుతామని చెప్పడంతో పోలింగ్ అనివార్యం అయింది

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana, TS Congress, Vijayashanti

  ఉత్తమ కథలు