ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తానని తెలిపారు.
నల్గొండ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలన్న తన నిర్ణయానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా గతంలోనే ఓకె చెప్పారని తెలియజేశారు. 20 ఏళ్లుగా తాను ప్రజల్లో ఉంటూ వస్తున్నానని, తన జీవితం ప్రజా జీవితానికే అంకితం అని అన్నారు.ఇక రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని, ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సర్పంచ్ సీట్లను గెలవాలని ఆకాంక్షించారు. గత నాలుగేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్‌లకు అసలు నిధులే ఇవ్వలేదని ఆరోపించారు. ఆఖరికి కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వేరే వాటికి మళ్లించిందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Komatireddy venkat reddy, Nalgonda, Telangana, Telangana News, TS Congress