హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Gali Janardhana Reddy : అనుకుంటే సీఎం అవుతా : గాలి జనార్ధన్ రెడ్డి -బీజేపీ హైకమాండ్ ఓకే?

Gali Janardhana Reddy : అనుకుంటే సీఎం అవుతా : గాలి జనార్ధన్ రెడ్డి -బీజేపీ హైకమాండ్ ఓకే?

బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి (పాత ఫొటో)

బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి (పాత ఫొటో)

బీజేపీ హైకమాండ్ కర్ణాటకలో మరోసారి ముఖ్యమంత్రిని మార్చుతుందనే ఊహాగానాల నడుమ.. తలుచుకుంటే నేను సీఎం అవుతానంటూ ఆ పార్టీకే చెందిన మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి బాంబు పేల్చారు. దీనిపై పార్టీ నేతలు సైతం స్పందించారు..

ప్రముఖ పారిశ్రామికవేత్త, కర్ణాటక (Karnataka) బీజేపీ (BJP) కీలక నేత, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhana Reddy) సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తలకెక్కారు. అక్రమమైనింగ్, అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న ఆయన కోర్టు చిక్కులు క్రమంగా తొలిగిపోతుండటంతో మళ్లీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. బీజేపీ హైకమాండ్ కర్ణాటకలో మరోసారి ముఖ్యమంత్రిని మార్చుతుందనే ఊహాగానాల నడుమ.. తలుచుకుంటే నేను సీఎం అవుతానంటూ గాలి బాంబు పేల్చారు.

కర్ణాటకలో తొలి బీజేపీ సర్కారు పతనం కావడానికి కారకుడిగా, అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీని తిరుగులేని శక్తిగా నిలబెట్టిన నేతగా పేరుపొందిన గాలి జనార్ధన్ రెడ్డి సీబీఐ కేసుల కారణంగా దాదాపు దశాబ్దకాలంగా క్రియాశీలరాజకీయాలకు దూరమైపోయారు. కేసుల ఉధృతి, ప్రభావం తగ్గిన తర్వాత మళ్లీ ఆయన పొలిటికల్ యాక్టివిటీలను ముమ్మరం చేశారు. శ్రీమంతుడైన గాలి 2023 ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు కొంతకాలంగా శ్రమిస్తున్నారు. తరచూ బళ్లారిలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ క్రమంలో..

Rythu Bandhu : 28 నుంచి రైతుబంధు రూ.7,500 కోట్లు జమ.. ఇలా చేస్తేనే ఖాతాల్లోకి డబ్బులు..


తాజాగా బళ్లారి పర్యటనలో బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను తలుకుంటే ఒక్కరోజైనా ముఖ్యమంత్రి అవుతాను. గాలి బ్రదర్స్ (నేను, సోమశేఖర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి)అయినా, బళ్లారి శ్రీరాములు అయినా మాకు డబ్బు అవసరమే లేదు. నాకు మంత్రి లేదా ముఖ్యమంత్రి కావాలనే కోరికా లేదు. కానీ నేను తలచుకుంటే ముఖ్యమంత్రిని కాగలను. దానికోసమే ఒక సమయం వస్తుందని ఎదురు చూస్తున్నాను..’అని జనార్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి బళ్లారిలోని క్లాసిక్ ఫంక్షన్ హాలులో గాలి సోమశేఖర్ రెడ్డి 57వ పుట్టినరోజు వేడుకల్లో మాట్లాడుతూ జనార్ధన్ రెడ్డి ఈ కామెంట్లు చేశారు.

తలుచుకుంటే ఒక్కరోజైనా సీఎం అవుతానంటూ గాలి జనార్ధన్ రెడ్డి చేసిన కామెంట్ల తాలూకు వీడియో వైరలైంది. వీడియోతోపాటే పాలిటిక్స్ లోకి గాలి రీఎంట్రీకి రంగం సిద్ధమైందని, బీజేపీ హైకమాండ్ సైతం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గాలికి కీలక బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. దీంతో బీజేపీ నేతలు వివరణలు ఇచ్చుకున్నారు.

బళ్లారిలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతోన్న బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి

Kiran Kumar Reddy : త్వరలో వస్తా.. అందరినీ కలుస్తా : మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి


గాలి వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిర్మల్ కుమార్ స్పందించారు.‘‘వచ్చే ఎన్నికల్లో ఆయన(జనార్ధన్ రెడ్డి) టికెట్ ఆశిస్తుండొచ్చు. అయితే ఆయనను బరిలోకి దింపే విషయమై పార్టీ ఇప్పటి వరకైతే ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి (బసవరాజు) బొమ్మై నేతృత్వంలోనే వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటాం’’అని నిర్మల్ కుమార్ చెప్పారు. ఇక

Draupadi Murmu : ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితం విషాదభరితం.. అన్నీ తట్టుకొని ఎదిగారిలా..

సోదరుడు జనార్ధన్ రెడ్డి సీఎం అవుతానన్న వీడియో దుమారం రేపుతుండటంపై బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి సైతం వివరణ ఇచ్చారు. ‘‘పార్టీ అనుచరులు, మా అభిమానులను ఉత్సాహపర్చేందుకే జనార్ధన్ రెడ్డి అలా మాట్లాడారు కానీ, పార్టీ నుంచి ఇప్పటివరకైతే మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. అలాగే, వచ్చే ఎన్నికల్లో పోటీ అంశంపైనా హైకమాండ్ తో ఇప్పటికైతే చర్చలు జరగలేదు’’అని గాలి సోమశేఖర్ రెడ్డి చెప్పారు.

First published:

Tags: Bjp, Gali Janardhana Reddy, Karnataka, Karnataka bjp

ఉత్తమ కథలు