హోమ్ /వార్తలు /national /

మరిన్ని ప్రాంతాలకు హైదరాబాద్ మెట్రో విస్తరణ: కేటీఆర్

మరిన్ని ప్రాంతాలకు హైదరాబాద్ మెట్రో విస్తరణ: కేటీఆర్

మంత్రి కేటీఆర్(ఫైల్ ఫోటో)

మంత్రి కేటీఆర్(ఫైల్ ఫోటో)

#HyderabadMetro | హైదరాబాద్‌లోని మరిన్ని ప్రాంతాలకు హైదరాబాద్ మెట్రోను విస్తరించనున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు.

  హైదరాబాద్‌ మెట్రో రైలును మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ఉదయం ఆయన ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా మెట్రో ప్రారంభోత్సవానికి సంబంధించిన చిత్రాలను కేటీఆర్ పంచుకున్నారు. హైదరాబాద మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే 3.2 కోట్ల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకున్నారని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నియంత్రణకు మెట్రో ఎంతగానో దోహదపడుతుందన్నారు.

  అటు రాజకీయ సీజనల్ పర్యాటకులు మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, చంద్రబాబు తదితరులు తెలంగాణ‌లో పర్యటిస్తున్నారంటూ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు దేశంలో అగ్ర రాజకీయ నేతలందరూ  తెలంగాణకు వరుసగట్టారని ఎద్దేవా చేశారు.  వీరు వస్తుంటారు...పోతుంటారు..కేసీఆర్ మాత్రమే ఇక్కడే ఉండి, ప్రజలకే సేవ చేస్తారని వ్యాఖ్యానించారు.

  Published by:Janardhan V
  First published:

  Tags: Brand Hyderabad, Hyderabad Metro, KTR, Telangana Election 2018

  ఉత్తమ కథలు