హోమ్ /వార్తలు /national /

టీఆర్ఎస్ సర్కార్‌ను ఇబ్బంది పెట్టేలా అసదుద్దీన్ ట్వీట్

టీఆర్ఎస్ సర్కార్‌ను ఇబ్బంది పెట్టేలా అసదుద్దీన్ ట్వీట్

ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ

ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ

Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో విషయంలో తెలంగాణ సర్కారును ఇరుకున పెట్టేలా మజ్లీస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

  జేబీఎస్- ఎంజీబీఎస్ మధ్య హైదరాబాద్ మెట్రో మార్గాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించనుండటం తెలిసిందే. ఈ విషయంలో టీఆర్ఎస్ సర్కారును ఇబ్బందిపెట్టేలా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ ట్వీట్ చేశారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు నిర్మాణం ఓకే.. మరి ఫలక్ నుమా సంగతేంటని మెట్రో రైలు యాజమాన్యంపై అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు దక్షిణ హైదరాబాద్ విషయానికొచ్చేసరికి మీ దగ్గర నిధులు ఉండవు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాస్తవానికి మూడో దశ మెట్రో రైలు జేబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో మార్గం పూర్తయ్యింది. ‘దార్ ఉల్ ఫిషా’ నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

  తన ట్వీట్‌లో అసదుద్దీన్ ఎక్కడా తెలంగాణ సర్కార్‌ను ప్రస్తావించలేదు. అయితే  జేబీఎస్ - ఎంజీబీఎస్ మార్గాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించనున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో యాజమాన్యాన్ని టార్గెట్ చేస్తూ అసదుద్దీన్ కామెంట్స్ చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

  Published by:Janardhan V
  First published:

  Tags: Asaduddin Owaisi, Hyderabad Metro

  ఉత్తమ కథలు