హోమ్ /వార్తలు /national /

Vizag: విశాఖకు 3 వేల కోట్ల నిధులు.. త్వరలోనే రాజధాని తరలింపు.. సంకేతాలిచ్చిన ఎంపీ విజయసాయి

Vizag: విశాఖకు 3 వేల కోట్ల నిధులు.. త్వరలోనే రాజధాని తరలింపు.. సంకేతాలిచ్చిన ఎంపీ విజయసాయి

సీఎం జగన్ ఢిల్లీ టూర్ లో ఏం జరిగింది..? అమిత్ షా -జగన్ మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయి.. మూడు రాజధానుల పై అమిత్ షా సంకేతాలు ఇచ్చారా..? తాజా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు అర్థం ఏంటి..?

సీఎం జగన్ ఢిల్లీ టూర్ లో ఏం జరిగింది..? అమిత్ షా -జగన్ మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయి.. మూడు రాజధానుల పై అమిత్ షా సంకేతాలు ఇచ్చారా..? తాజా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు అర్థం ఏంటి..?

సీఎం జగన్ ఢిల్లీ టూర్ లో ఏం జరిగింది..? అమిత్ షా -జగన్ మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయి.. మూడు రాజధానుల పై అమిత్ షా సంకేతాలు ఇచ్చారా..? తాజా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు అర్థం ఏంటి..?

  ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తరువాత ఏపీలో పరిణామాలు చకచకా మారుతున్నట్టు ఉన్నాయి. సీఎం జగన్ కేంద్ర హోం మంత్రితో గంటన్నర సేపు ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా మూడు రాజధానులకు మద్దతు తెలపాలని మరోసారి కోరారు. అయితే అమిత్ షా ఎలాంటి హామీ ఇచ్చారో తెలియదు కానీ.. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా మారేందకు వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా మంత్రులు, ఎంపీలు అంతా అదే మాట చెబుతున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి రాజధానుల అంశంపై మాట్లాడారు. విశాఖపట్నానికి రాజధాని రావడం ఖాయమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాజధాని రావడం ఖాయమని తాము పదేపదే చెబుతున్నామన్నారు. అయితే విశాఖకు రాజధాని త్వరలోనే వస్తుందని, తేదీ ఎప్పుడు అనేది తామే చెబుతామని.. ఇంకా తేదీ ఫిక్స్ చేయలేదన్నారు. దీనికి సంబంధించి తమకు సంకేతాలు అందాయని అంతకంటే ఇప్పుడు ఏమీ మాట్లాడడం మంచిది కాదన్నారు.

  మరోవైపు వాల్యు బేసిడ్ టాక్స్ విధానం అనేది దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయమని, దాన్ని మనం కూడా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. 15 శాతం కన్నా ఎక్కువగా టాక్స్ పెరిగే అవకాశం లేదన్నారు. స్లమ్స్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకున్నప్పుడు గ్యారెంటీ కింద ప్రభుత్వ ఆస్తులు పెట్టడం అనేది ఈ రోజు కొత్తగా వచ్చింది ఏమీ కాదని, ఆ విధానం ఎప్పటి నుంచో వస్తున్నదే అని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.

  ఇదీ చదవండి: ఆ రెండు జిల్లాలు మినహా.. భారీగా తగ్గుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే..?

  ఇటు మంత్రి అవంతి సైతం విశాఖకు త్వరలోనే రాజధాని వస్తోంది అన్నారు. అలాగే విశాఖ నగర బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు. విశాఖ నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రోడ్డును నిర్మిస్తున్నామన్నారు. అలాగే 9 బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. విశాఖలో భూముల ఆక్రమణలు జరుగకుండా చూసి వాటిని కాపాడాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశ్యమని ఆయన అన్నారు.

  ఇదీ చదవండి: ఆక్సిజన్ తొలి ప్లాంట్ ఏపీలోనే ఎందుకంటే.. సేవా కార్యక్రమాలపై సోనూ స్పందన

  మరోమంతి కన్నబాబు సైతం విశాఖకు రాజధాని వచ్చేస్తోంది అన్నారు. నగరంలో డిసెంబర్ నాటికి మూడు వేల కోట్ల రూపాయల విలువైన పనులు చేసి వాటి ప్రారంభానికి సిద్ధం చేస్తామని కన్నబాబు తెలిపారు. సుమారు 450 కోట్ల రూపాయలు విలువైన పనులు రెండు మూడు నెలల్లో పూర్తవుతాయని కన్నబాబు పేర్కొన్నారు. విశాఖకు పరిపాలనా రాజధాని వస్తుంది కాబట్టి, ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించారని ఆయన తెలిపారు. నగరంలో ఓపెన్ ప్రదేశాలను, పార్కులను దశల వారీగా అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Avanti srinivas, Kannababu, Vijayasai reddy, Visakha, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు