హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఇందిరాగాంధీ ఇంటికి భారీ ట్యాక్స్.. ఎంతో తెలుసా..?

ఇందిరాగాంధీ ఇంటికి భారీ ట్యాక్స్.. ఎంతో తెలుసా..?

దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ.. (1950లో జ్యురిచ్ పర్యటనలో తీసిన ఫోటో)

దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ.. (1950లో జ్యురిచ్ పర్యటనలో తీసిన ఫోటో)

ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ చౌదరి మాత్రం ట్యాక్స్ నోటీసులను వ్యతిరేకించారు. ఆనంద్ భవన్‌ను జవహర్‌లాల్ ట్రస్టుగా నడుపుతున్నందునా.. అన్ని రకాల పన్నుల నుంచి దాన్ని మినహాయించినట్టు గుర్తుచేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న దివంగత ఇందిరాగాంధీ పుట్టినిల్లు 'ఆనంద్ భవన్'కి మున్సిపల్ కార్పోరేషన్ ట్యాక్స్ నోటీసులు జారీ చేసింది. ఏకంగా రూ.4.35కోట్లు పెండింగ్ ట్యాక్స్ చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. నాన్ రెసిడెన్షియల్ కేటగిరీలో ఈ భవనానికి 2013 నుంచి ట్యాక్స్ చెల్లించలేదని పేర్కొంది. గాంధీ కుటుంబానికి చెందిన ఆనంద్ భవన్ ఇంటిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జవహర్‌లాల్ నెహ్రూ ట్రస్ట్‌గా నడుపుతున్నారు.

పెండింగ్ ట్యాక్స్‌పై నోటీసులు జారీ చేయడానికి సర్వే లాంటిది చేశాం. దీనిపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కూడా కోరాం. అయితే అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో మున్సిపల్ కార్పోరేషన్ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేశాం.
పీకే మిశ్రా,చీఫ్ ట్యాక్స్ ఆఫీసర్

మరోవైపు ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ చౌదరి మాత్రం ట్యాక్స్ నోటీసులను వ్యతిరేకించారు. ఆనంద్ భవన్‌ను జవహర్‌లాల్ ట్రస్టుగా నడుపుతున్నందునా.. అన్ని రకాల పన్నుల నుంచి దాన్ని మినహాయించినట్టు గుర్తుచేశారు. స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించి అదొక స్మారక భవనం అని.. ఎన్నో స్మృతులతో ముడిపడి ఉన్న ఆ భవనం 'సెంటరాఫ్ ఎడ్యుకేషన్'గా మారిందని చెప్పారు.అలాంటి భవనానికి ట్యాక్స్ నోటీసులు జారీ చేయడం సరికాదన్నారు. ఇదంతా బీజేపీ ఎజెండాలో భాగమేనని ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే అధికారులు ఇలా చేశారని ఆరోపించారు.

First published:

Tags: Congress, Indira Gandhi, Uttar pradesh

ఉత్తమ కథలు