హోమ్ /వార్తలు /జాతీయం /

Modi Interview Highlights : రాఫెల్, కశ్మీర్, న్యాయ్, జాతీయవాదం.. మోదీ మనోగతం..

Modi Interview Highlights : రాఫెల్, కశ్మీర్, న్యాయ్, జాతీయవాదం.. మోదీ మనోగతం..

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

Modi Exclusive Interview : భారత ప్రధాని నరేంద్ర మోదీ CNN NEWS18కి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల వేళ ఆయన ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో చాలా అంశాలపై సమగ్రంగా మాట్లాడారు. జాతీయవాదం మొదలుకుని దేశంలోని సమస్యలు, ప్రతిపక్షాల ఆరోపణలు, ఐదేళ్ల పాలనలో అందించిన పథకాలు, ఎన్నికల ఫలితాలపై ఉన్న అంచనాలు.. ఇలా అనేక అంశాలపై మోదీ తన మనోగతాన్ని వినిపించారు.

ఇంకా చదవండి ...

  రాఫెల్ ఆరోపణలు అవాస్తవం... నేను ఇప్పటికీ చౌకీదార్‌నే : రాఫెల్ డీల్‌లో ప్రధాని మోదీ అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. మోదీ చౌకీదార్ కాదనీ, చోర్ అనీ సెటైర్లు కూడా వేస్తున్నాయి. మోదీ మాత్రం నేను కూడా చౌకీదార్‌ని అనే నినాదం అందుకున్నారు. ఆయనకు ఆ ఐడియా ఎలా వచ్చింది. దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఈ విషయంపై న్యూస్18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్‌ రాహుల్ జోషితో ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


  తల్లీ, కొడుకులు బెయిల్ తెచ్చుకొని... బయట తిరుగుతున్నారు: అవినీతిపై ప్రభుత్వం యుద్దం చేస్తుందంటూ... 2014లో అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అయ్యింది. ఈ ఐదేళ్లలో అవినీతి పరుల ఆటకట్టించింది. మూలనపడిన అవినీతి కేసుల్ని తిరగతోడిందా? అంటే అవుననే సమాధానమిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. న్యూస్ 18 గ్రూప్... ప్రధాని మోదీని ఇదే విషయంపై ఆయన అభిప్రాయం కోరింది. దీనిపై స్పందించిన నమో... మా హయాంలో అవినీతికి అడ్డుకట్ట వేశామన్నారు.పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


  అలా చేయడం... సైనికుల్ని ఉరికంబం ఎక్కించడమే : కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో... జమ్మూకాశ్మీర్‌లోని సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(Armed Forces Special Powers Act (AFSPA)) సవరిస్తామనే ప్రతిపాదన పెట్టింది. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఆ చట్టాన్ని సవరించడమంటే... సైనికుల్ని ఉరికంబం ఎక్కించడంతో సమానమని వ్యాఖ్యానించారు. న్యూస్18కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


  కాశ్మీర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు...చేసి చూపిస్తాం: తాజాగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కాశ్మీర్ ప్రత్యేక అధికారులు కల్పించే ఆర్టికల్ 370 , 35లను రద్దు చేస్తామని అందులో పొందుపరిచారు. మరి భవిష్యత్తులో ఇదే జరగనుండా ? కాశ్మీర్ ప్రత్యేక అధికారాల్ని బీజేపీ సర్కార్ రద్దు చేయనుందా ? అన్న ప్రశ్నలకు మోదీ అవుననే సమాధానమిస్తున్నారు. న్యూస్ 18 గ్రూప్... నిర్వహించిన మోదీ ఇంటర్య్వూలో ఆయన ఇలాంటి అభిప్రాయమే వ్యక్తంచేశారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


  కాంగ్రెస్ ఇప్పుడు 'న్యాయ్' అంటోంది.. 60 ఏళ్ల అన్యాయం సంగతేంటి? : భారత ప్రధాని నరేంద్ర మోదీ CNN NEWS18కి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల వేళ ఆయన ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో చాలా అంశాలపై సమగ్రమైన సమాధానాలిచ్చారు. జాతీయవాదం మొదలుకుని దేశంలోని సమస్యలు, ప్రతిపక్షాల ఆరోపణలు, ఐదేళ్ల పాలనలో అందించిన పథకాలు, ఎన్నికల ఫలితాలపై ఉన్న అంచనాలు.. ఇలా అనేక అంశాలపై మోదీ తన మనోగతాన్ని వినిపించారు. ఇదే ఇంటర్వ్యూలో.. కాంగ్రెస్ 'న్యాయ్' పథకంపై మోదీ పలు విమర్శలు గుప్పించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


  మాయావతి మునిగిపోతున్న నావలో ఉన్నారు.. ఆ అప్పీల్‌పై సెక్యులరిస్టుల స్పందనేది? :బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇటీవలి స్టేట్‌మెంట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. ముస్లింలు మహాకూటమికి మాత్రమే ఓటు వేసి ఓట్ల చీలిక జరగకుండా చూడాలన్న ఆమె కామెంట్స్‌పై కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, మాయావతి వ్యాఖ్యలపై సెక్యులరిస్టుల మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


  అమిత్ షా కష్టం మామూలుది కాదు.. ఆయనలా మరెవరూ కష్టపడలేరు : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. బెంగాల్‌లో బీజేపీ 23 ఎంపీ స్థానాలు గెలుస్తుందన్న అమిత్ షా ధీమాపై మోదీని ప్రశ్నించగా.. అమిత్ షా పనితనాన్ని ఆయన కొనియాడారు. ఆయన పడే కష్టం వల్ల పార్టీకి అనేక విధాలుగా మేలు జరిగిందని తెలిపారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


  ఒకప్పుడు భారత్ పరిస్థితి అది.. ఇప్పుడు ఇది.. : పాక్-చైనా మిత్రుత్వంపై ప్రధాని మోదీ స్పందించారు. తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర పడకుండా చైనా నాలుగోసారి అడ్డుకుంది. ఈ నేపథ్యంలో చైనాపై ఒత్తిడి తీసుకురావడానికి ఏం చేయబోతున్నారు? అన్న ప్రశ్నకు మోదీ ఆసక్తికర సమాధానం చెప్పారు. ఒకప్పుడు అంతర్జాతీయంగా భారత్ పరిస్థితి ఏమిటి.. ఇప్పుడేమిటి అన్నది వివరించారు.పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


  అసలు జాతీయవాదం అంటే ఏమిటి? సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ నినాదమా? : భారత ప్రధాని నరేంద్ర మోదీ CNN NEWS18కి ఎక్స్‌క్లూజివ్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో జాతీయవాదంపై స్పందించారు. దేశంలో ఉన్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ జాతీయవాదాన్ని ఎత్తుకుందా? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. జాతీయవాదం అంటే తన దృష్టిలో డైనమిక్‌గా వ్యవహరించడం అని మోదీ అన్నారు.పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


  ఎన్నికల తర్వాత జగన్, కేసీఆర్‌లతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా? : ఎన్నికల తర్వాత కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. జగన్, కేసీఆర్‌ పేర్లు ప్రస్తావించకుండానే అవసరమైతే సింగిల్ ఎంపీ సీటు ఉన్న పార్టీ మద్దతు కూడా కోరుతామని చెప్పారు. పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేస్తూనే ఆయన ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


  పీడీపీతో పొత్తు ఓ ప్రయోగం... కాశ్మీర్‌లో అభివృద్ధిని మీడియా చూపించాలి : PDPతో మీ పొత్తును తప్పిదంగా భావిస్తున్నారా... జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని అంచనా వెయ్యవచ్చు అన్న ప్రశ్నకు... న్యూస్18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్‌ రాహుల్ జోషితో ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పీడీపీతో పొత్తు ఓ ప్రయోగం అన్నారు మోదీ. కాశ్మీర్ ప్రజల తీర్పు ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వలేదన్న మోదీ... పీడీపీ, ఎన్సీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తాము ఎదురుచూసినట్లు ప్రధాని తెలిపారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


  కశ్మీర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు...చేసి చూపిస్తాం: తాజాగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కాశ్మీర్ ప్రత్యేక అధికారులు కల్పించే ఆర్టికల్ 370 , 35లను రద్దు చేస్తామని అందులో పొందుపరిచారు. మరి భవిష్యత్తులో ఇదే జరగనుండా ? కాశ్మీర్ ప్రత్యేక అధికారాల్ని బీజేపీ సర్కార్ రద్దు చేయనుందా ? అన్న ప్రశ్నలకు మోదీ అవుననే సమాధానమిస్తున్నారు. న్యూస్ 18 గ్రూప్... నిర్వహించిన మోదీ ఇంటర్య్వూలో ఆయన ఇలాంటి అభిప్రాయమే వ్యక్తంచేశారు. 1950లోనే కొన్ని రాజకీయ కుటుంబాలు సృష్టించిన సమస్య కాశ్మీర్ అన్నారు. వారి వల్లే ఈ తప్పిదం జరిగిందన్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


  ' isDesktop="true" id="172720" youtubeid="h0KXnhV7wSY" category="national">  ఇది కూడా చదవండి :

  BIGGEST EXCLUSIVE INTERVIEW : ఎన్నికల వేళ మోదీ అంతరంగ ఆవిష్కరణ


  First published:

  Tags: Amit Shah, Bjp, Congress, Jammu and Kashmir, Lok Sabha Election 2019, Mayawati, Narendra modi, Pm modi, Rafale Deal, Rahul Gandhi

  ఉత్తమ కథలు