హోమ్ /వార్తలు /national /

tirupati by poll: తిరుపతిలో టెన్షన్ టెన్షన్.. చంద్రబాబుపై రాళ్ళ దాడి.. రోడ్డుపై బైఠాయింపు

tirupati by poll: తిరుపతిలో టెన్షన్ టెన్షన్.. చంద్రబాబుపై రాళ్ళ దాడి.. రోడ్డుపై బైఠాయింపు

తిరుపతిలో టెన్షన్ టెన్షన్

తిరుపతిలో టెన్షన్ టెన్షన్

సొంత జిల్లా చిత్తూరులో చంద్రబాబుకు వరుస రెండోసారి షాక్ తగిలింది. మొన్న రేణిగుంట పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు నాయుడ్ని పోలీసులే అడ్డుకున్నారు. దీంతో ఎయిర్ పోర్టులోనే ఆయన బైఠాయించారు. తాజాగా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో చంద్రబాబు పై రాళ్ల దాడి జరిగింది. దీంతో ఆయన మరోసారి రోడ్డుపైనా బైఠాయించారు.

ఇంకా చదవండి ...

తిరుపతిలో టెన్షన్ టెన్షన్ నెలకొంది. వరుసగా రెండోసారి చిత్తూరు పర్యటనలో చంద్రబాబుకు షాక్ తగిలింది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రేణిగుంట ఎయిర్ పోర్టులోనే చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా ఎయిర్ పోర్టులోనే ఆయన బైఠాయించారు. ఇప్పుడు తాజాగా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో అలాంటి సీన్ రిపీట్ అయ్యింది.


చంద్రబాబు ఉప ఎన్నికల ప్రచారంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తిరుపతిలోని ప్రధాన రైల్వే కూడలి నుంచి కృష్ణ పురం ఠాణా వరకు చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారం తరువాత కృష్ణాపురం ఠాణా దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించారు, తిరుపతి అభివృద్ధి జరిగిందంటే అది కేవలం టీడీపీ హయాంలోనే అంటూ  స్పష్టం చేశారు. తిరుపతి సర్వముఖాభివృద్ది చెందాలంటే టీడీపీతోనే సాధ్యమన్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరిన చంద్రబాబు. .ప్రసంగం చివరి దశకు చేరుకున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు.. చంద్రబాబు టార్గెట్ గా రాళ్ల దాడి చేసినట్టు గుర్తించారు.

రాళ్ళూ రువ్విన వారిపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చేతకాని దద్దమ్మలు ఇలాంటి పనులు చేస్తారని.. ధైర్యముంటే ముందుకు వచ్చి దాడి చేయాలనీ సవాల్ విసిరారు. వాహనంపై రాయి వేసేందుకు ప్రయత్నించిన యువకుడు దెబ్బతగిలిన యువకున్ని తన వాహనంపై తీసుకొచ్చిన చంద్రబాబు. పోలీసుల వెనుక ఉండి మాపై దాడికి యత్నించడం చాల దారుణమని మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీకి పోలీసులపై ఏమాత్రం నమ్మకం లేదని తెలిపారు. పారామిలిటరీ దళాలతో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు నాయుడు కోరారు. ప్రచార రథం నుంచి కిందకు దిగిన చంద్రబాబు.. కృష్ణాపురం ఠాణా కూడలి దగ్గర నిరసన వ్యక్తం చేసారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపైనే  బైఠాయించి రాళ్లదాడికి పాల్పడ్డ ఆకతాయిలను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. సభకు పోలీసులు రక్షణ కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేయాలనీ కోరారు. రౌడీయిజం సహించనన్న చంద్రబాబు...జడ్ ప్లస్ కేటగిరి లో ఉన్న తనకే రక్షణ కల్పించకకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇది పిరికిపంద చర్య అని.. పోలీసుల వైఫల్యమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రౌడీయిజం నశించాలంటూ చంద్రబాబు నినాదాలు చేశారు. తనకు రక్షణ లేకపోతే ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.


తరువాత తిరుపతిలోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు... సభలో రాళ్లు రువ్విన వారిపై ఏఎస్పీ అడ్మిన్ సుప్రజకు ఫిర్యాదు చేసారు. ఏఎస్పీలు సుప్రజ, మునిరామయ్య లకు రాతపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు.  రాష్ట్రంలో చట్టం కొందరికే చుట్టంలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి ఘటన వల్ల  పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోయిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఎన్నికలకు కేంద్ర బలగాలను రంగంలోకి దింపి...ఎన్నికలు సజావుగా సాగేలా చేయాలనీ కోరారు. ఇది కేవలం రాజకీయంగా కుట్ర పన్నారని మండిపడ్డారు. స్వేచ్ఛగా....నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేసారు

First published:

Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP, Tirupati, Tirupati Loksabha by-poll, Ycp

ఉత్తమ కథలు