హోమ్ /వార్తలు /national /

తాడేపల్లిగూడెంలో టీడీపీVsబీజేపీ.. మాణిక్యాలరావు నివాసం వద్ద ఉద్రిక్తత..

తాడేపల్లిగూడెంలో టీడీపీVsబీజేపీ.. మాణిక్యాలరావు నివాసం వద్ద ఉద్రిక్తత..

ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు(File)

ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు(File)

నియోజకవర్గ అభివృద్దిని అడ్డుకుంటున్నారని, టీడీపీ నాయకులు అవినీతిలో కూరుకుపోయారని మాణిక్యాలరావు ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. అవినీతిలో కూరుకుపోయింది మాణిక్యాలరావే అంటూ టీడీపీ ఎదురుదాడికి దిగింది.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని మాణిక్యాలరావు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గృహ నిర్భంధాన్ని చేధించుకుని బయటకు వచ్చిన ఆయన్ను పోలీసులు బలవంతంగా మళ్లీ ఇంట్లోకి లాక్కెళ్లారు.ఈ క్రమంలో పోలీసులకు, మాణిక్యాలరావు అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కాగా, నియోజకవర్గ అభివృద్దిపై టీడీపీ, బీజేపీలు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకోవడం.. ఆపై బహిరంగ చర్చకు సిద్దమవడంతో తాడేపల్లిగూడెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురువారం మధ్యాహ్నాం వెంకట్రామన్నగూడెంలో ఈ రెండు పార్టీలు బహిరంగ చర్చకు సిద్దమయ్యాయి.ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ మంత్రి, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావును బహిరంగ సభకు వెళ్లకుండా ఆయన్ను గెస్ట్ హౌజ్‌లోనే నిర్బంధించారు. మరోవైపు టీడీపీ నేత బాపిరాజు, ఆయన అనుచరులను కూడా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. వెంకట్రామన్న గూడెంలో బహిరంగ చర్చ కోసం ఏర్పాటు చేసిన వేదికను తొలగించారు. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్‌ విధించారు.

కాగా, నియోజకవర్గ అభివృద్దిని అడ్డుకుంటున్నారని, టీడీపీ నాయకులు అవినీతిలో కూరుకుపోయారని మాణిక్యాలరావు ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. అవినీతిలో కూరుకుపోయింది మాణిక్యాలరావే అంటూ టీడీపీ ఎదురుదాడికి దిగింది. అభివృద్దిపై బహిరంగ చర్చకు సిద్దమా.. అంటూ టీడీపీ నేత ముళ్లపూడి బాపిరాజు సవాల్ విసిరారు. మాణిక్యాలరావు చర్చకు సిద్దమనడంతో.. ఇరు వర్గాలు బాహాబాహికి సిద్దమయ్యాయి. అయితే బహిరంగ చర్చకు దిగితే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో పోలీసులు వీరిని అడ్డుకున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Bjp-tdp

ఉత్తమ కథలు