ఏపీలో ఎన్నికల వేళ మంచు ఫ్యామిలీ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై మోహన్ బాబు ఒంటికాలిపై లేస్తున్నారు. తన విద్యానికేతన్ సంస్థలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రి ఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడం లేదంటూ.. టీడీపీ సర్కారుపై ధ్వజమెత్తుతున్నారు. విద్యార్థులతో కలిసి ఆయన తాజాగా భారీ నిరసన ర్యాలీ చేపట్టడం రాజకీయంగా సంచలనం రేపింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా మోహన్‌బాబు కావాలనే ఇదంతా చేస్తున్నారంటూ అధికార టీడీపీ వర్గాలు ఆరోపణలు మొదలు పెట్టాయి. దీనికి ప్రతిగా మంచు ఫ్యామిలీ సైతం.. టీడీపీ నేతలపై కౌంటర్ టాక్ చేస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. ట్విట్టర్ వేదికగా మంచు హీరోలు హాట్ కామెంట్లతో రాజకీయ సెగ పుట్టిస్తున్నారు. అయితే, ఇదంతా జగన్‌కు మేలు చేకూర్చేందుకు మోహన్‌బాబు కావాలని చేస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మంచు హీరోల్లో ఒకరైన మనోజ్.. ట్విట్టర్ వేదికగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను జనసేనకు సపోర్ట్ చేస్తానని చెప్పారు. అయితే, తారక్ రాజకీయ రంగంలోకి దిగితే మాత్రం.. అతని ప్రాణానికి తన ప్రాణం అడ్డేస్తానని చెప్పారు. ట్విట్టర్‌లో అభిమానుల మధ్య జరిగిన ఆసక్తిరమైన చర్చ సందర్భంగా మంచు మనోజ్ ఈ విధంగా రిప్లై ఇచ్చారు.
Tarak vasthe inka nenu yettu velthanu thammudu?! Naa Mithrudi raka kosam yedhuruchoosthunam ... Tarak prananiki na Pranam Addu 💪🏽 https://t.co/IatOfUuUti
— MM*🙏🏻❤️ (@HeroManoj1) March 23, 2019
తారక్ రాజకీయాల్లో రావాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని మంచు మనోజ్ అన్నారు. అన్నయ్య రాజకీయాల్లోకి వస్తే.. ఆయన వెంటే ఉంటానని స్పష్టం చేశారు. అయితే, మరో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మనోజ్.. తాను జనసేనకు మద్దతునిస్తానని స్పష్టం చేశారు. ఇప్పుడిదే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. మంచు మనోజ్ జై జనసేన అనడం పట్ల.. నేటిజన్లలోనే కాదు , రాజకీయవర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
Of course I support always 💪🏽🔥 #VeeraSena #Janasena https://t.co/74ydc6m0YL
— MM*🙏🏻❤️ (@HeroManoj1) March 23, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Janasena, Manchu Family, Manchu Manoj, Mohan Babu, Pawan kalyan