POLITICS GUJARAT PATIDAR LEADER HARDIK PATEL RESIGNS CONGRESS PARTY LIKELY TO JOIN BJP SOON SK
Hardik patel: కాంగ్రెస్‌కు హార్దిక్ పటేల్ రాజీనామా.. గుజరాత్ ఎన్నికల ముందు పార్టీకి బిగ్ షాక్
హార్దిక్ పటేల్ (ఫైల్ ఫోటో)
Hardik Patel: మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి పటిదార్ నేత హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు.
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి (Congress Party) బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటిదార్ లీటర్ హార్దిక్ పటేల్ (Hardik Patel) ఆ పార్టీకి గుడ్ బై (Hardik Patel quits Congress) చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ''ఎంతో ధైర్యం చేసి కాంగ్రెస్ పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఈ నిర్ణయాన్ని నా సహరులు, గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారని అనుకుంటున్నా. ఈ అడుగుతో రాబోయే రోజుల్లో గుజరాత్ కోసం సానుకూలంగా పనిచేసే అవకాశం లభిస్తుందని నమ్ముతున్నా. '' అని హార్దిక్ పటేల్ ట్వీట్ చేశారు.
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
గతంలో పటీదార్ ఉద్యమానికి నాయకత్వం వహించి, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన హార్దిక్ పటేల్.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అప్పట్లో ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. 2020లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. కానీ ఇప్పుడు ఎవరూ తనను పట్టించుకోవడం లేదని హార్దిక్ పటేల్ వాపోతున్నారు. పటిదార్ కమ్యూనిటీలో బలమైన నేతగా పేరున్న తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాదు కొన్ని రోజులుగా కాంగ్రస్ పార్టీపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. పెళ్లికి ముందు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (వేసక్టమీ) చేసిన వరుడిలా తన పరిస్థితి తయారయిందని ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు హార్దిక్ పటేల్.
కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్వహించిన చింతన్ శివిర్ కార్యక్రమానికి ఒక రోజు ఆలస్యంగా వచ్చారు. రెండు రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో రెండో రోజు మాత్రమే పాల్గొన్నారు. అది కూడా అంటీముంటనట్టుగా ఉన్నారు. ఆయన పార్టీని వీడతారని ఆ రోజు నుంచి జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత పటిదార్ ముఖ్యనేత నరేష్ పటేల్‌ను కలిశారు. రాజకీయాల్లో చేరికపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవలని కోరారు. ఆ భేటీ జరిగిన కొన్ని రోజులకే.. కాంగ్రెస్‌ను వీడారు హార్దిక్ పటేల్. అందరూ అనుకున్నట్లుగానే.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా (Hardik patel resigns to congess) చేశారు. త్వరలో ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే తన అనుచరులు, పటిదార్ కమ్యూనిటీ లీడర్లతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించునన్నారు హార్దిక్ పటేల్.
గుజరాత్లో ఈ ఏడాది డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉండడంతో అన్నిపార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బీజేపీని ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్.. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్... ఎవరికి వారు వ్యూహాల్లో తలమునకలయ్యారు. ఈసారి ఆమాద్మీ పార్టీ కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పంజాబ్ తీర్పు ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో గుజరాత్‌లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. హార్దిక్ పటేల్ రాజీనామా వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.