హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు..ఓటేసిన టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా..పోలింగ్ శాతం ఎంతంటే?

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు..ఓటేసిన టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా..పోలింగ్ శాతం ఎంతంటే?

PC: Twitter

PC: Twitter

గుజరాత్ తొలి విడత ఎన్నికల పోలింగ్ నెమ్మదిగా సాగుతుంది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో జనాలు లేక పోలింగ్ నత్తనడకన సాగుతుంది. అయితే మధ్యాహ్నం పోలింగ్ శాతం పెరిగి అవకాశం ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 11 గంటల వరకు 18.95 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక ఈ ఎన్నికల్లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూమ్ నగర్ లోని ఓ పోలింగ్ స్టేషన్ లో జడేజా ఓటు వేశారు. ప్రజలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి పోలింగ్ లో పాల్గొనాలని జడేజా పిలుపునిచ్చారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat, India

గుజరాత్ తొలి విడత ఎన్నికల పోలింగ్ (Gujarat Assembly Elections)

నెమ్మదిగా సాగుతుంది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో జనాలు లేక పోలింగ్ నత్తనడకన సాగుతుంది. అయితే మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం (Polling Percentage) పెరిగి అవకాశం ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 11 గంటల వరకు 18.95 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు 34.48, 3 గంటల వరకు 48.48 శాతం పోలింగ్, 5 గంటల వరకు సుమారు 60 శాతం వరకు పోలింగ్ నమోదు అయింది. ఈ ఎన్నికల్లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూమ్ నగర్ లోని ఓ పోలింగ్ స్టేషన్ లో జడేజా (Ravindra Jadeja) ఓటు వేశారు. ప్రజలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి పోలింగ్ లో పాల్గొనాలని జడేజా (Ravindra Jadeja) పిలుపునిచ్చారు.

Gujarat Elections 2022 : నేడు గుజరాత్ తొలి విడత ఎన్నికలు .. ఇవీ ప్రత్యేకతలు

కాగా గుజరాత్ ఎన్నికల్లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) భార్య రివాబా జడేజా జామ్ నగర్ నార్త్ నియోజకవర్గ నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. భార్య కోసం రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కూడా రంగంలోకి దిగారు. ఒకవైపు భార్యలో ఇంటింటి ప్రచారం చేస్తుంటే.. మరోవైపు రవీంద్ర జడేజా (Ravindra Jadeja) రోడ్ షోలతో బిజీగా ప్రచారం చేశారు. బీజేపీకి ఓటు వేసి..తన భార్య రివాబాను గెలిపించాల్సిందిగా ప్రచారం గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో రివాబాకు వ్యతిరేకంగా ఆమె సొంత వదినే ప్రచారం చేయడం గమనార్హం.

Gujarat Polling : సైకిల్‌కు సిలిండర్‌ కట్టుకుని వెళ్లి ఓటు వేసిన ఎమ్మెల్యే

ఇక గుజరాత్ ఎన్నికలు రెండు విడతల్లో జరపనున్నారు. నేడు తొలి విడతలో మొత్తం 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా స్థానాలకు రెండో విడతలో పోలింగ్ జరగనుంది. తొలి దశలో మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 70 మంది మహిళలు ఉండగా.. 339 మంది స్వతంత్ర అభ్యర్ధులున్నారు. ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం మొత్తం 25,430 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేయగా తొలి దశలో 2,39,76,670 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగనుంది. మరి గుజరాత్ లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందా లేక కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందా లేదా ఆప్ ఏదైనా అద్భుతం చేస్తుందా అనేది చూడాలి.

First published:

Tags: Bjp, Gujarat, Gujarat Assembly Elections 2022, Ravindra Jadeja

ఉత్తమ కథలు