గుజరాత్ తొలి విడత ఎన్నికల పోలింగ్ (Gujarat Assembly Elections)
నెమ్మదిగా సాగుతుంది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో జనాలు లేక పోలింగ్ నత్తనడకన సాగుతుంది. అయితే మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం (Polling Percentage) పెరిగి అవకాశం ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 11 గంటల వరకు 18.95 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు 34.48, 3 గంటల వరకు 48.48 శాతం పోలింగ్, 5 గంటల వరకు సుమారు 60 శాతం వరకు పోలింగ్ నమోదు అయింది. ఈ ఎన్నికల్లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూమ్ నగర్ లోని ఓ పోలింగ్ స్టేషన్ లో జడేజా (Ravindra Jadeja) ఓటు వేశారు. ప్రజలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి పోలింగ్ లో పాల్గొనాలని జడేజా (Ravindra Jadeja) పిలుపునిచ్చారు.
కాగా గుజరాత్ ఎన్నికల్లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) భార్య రివాబా జడేజా జామ్ నగర్ నార్త్ నియోజకవర్గ నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. భార్య కోసం రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కూడా రంగంలోకి దిగారు. ఒకవైపు భార్యలో ఇంటింటి ప్రచారం చేస్తుంటే.. మరోవైపు రవీంద్ర జడేజా (Ravindra Jadeja) రోడ్ షోలతో బిజీగా ప్రచారం చేశారు. బీజేపీకి ఓటు వేసి..తన భార్య రివాబాను గెలిపించాల్సిందిగా ప్రచారం గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో రివాబాకు వ్యతిరేకంగా ఆమె సొంత వదినే ప్రచారం చేయడం గమనార్హం.
#GujaratElections2022 | Cricketer Ravindra Jadeja cast his vote at a polling station in Jamnagar. His wife and BJP candidate Rivaba Jadeja voted in Rajkot earlier today.
Ravindra Jadeja says, "I appeal to the people to vote in large numbers." pic.twitter.com/TXyu2W8JoD — ANI (@ANI) December 1, 2022
ఇక గుజరాత్ ఎన్నికలు రెండు విడతల్లో జరపనున్నారు. నేడు తొలి విడతలో మొత్తం 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా స్థానాలకు రెండో విడతలో పోలింగ్ జరగనుంది. తొలి దశలో మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 70 మంది మహిళలు ఉండగా.. 339 మంది స్వతంత్ర అభ్యర్ధులున్నారు. ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం మొత్తం 25,430 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేయగా తొలి దశలో 2,39,76,670 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగనుంది. మరి గుజరాత్ లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందా లేక కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందా లేదా ఆప్ ఏదైనా అద్భుతం చేస్తుందా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Gujarat, Gujarat Assembly Elections 2022, Ravindra Jadeja