హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Gujarat elections : కొత్త సర్వే..గుజరాత్ లో మళ్లీ బీజేపీదే అధికారం,ఎన్ని సీట్లు వస్తాయంటే..?

Gujarat elections : కొత్త సర్వే..గుజరాత్ లో మళ్లీ బీజేపీదే అధికారం,ఎన్ని సీట్లు వస్తాయంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gujarat elections : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు(Gujarat assembly elections) దగ్గరపడుతున్నాయి. డిసెంబర్ 1న తొలి దశ, డిసెంబర్ 5న రెండో దశ ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక మొదటి దశ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు 17తో ముగియగా..రెండో దశ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ నవంబర్ 21తో ముగిసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Gujarat elections : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు(Gujarat assembly elections) దగ్గరపడుతున్నాయి. డిసెంబర్ 1న తొలి దశ, డిసెంబర్ 5న రెండో దశ ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక మొదటి దశ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు 17తో ముగియగా..రెండో దశ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ నవంబర్ 21తో ముగిసింది. కాగా ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress), ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 1621 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ క్రమంలో ఇండియా టుడే చానల్ ఓటర్ల మానసిక స్థితిని అంచనా వేయడానికి, ఏ పార్టీకి ప్రయోజనం కలిగి ఉందో అంచనా వేయడానికి తన అభిప్రాయ సేకరణను నిర్వహించింది. నవంబర్ 20 నుండి 27 వరకు ఇండియా టీవీ కోసం మ్యాట్రిజ్ 45,000 శాంపిల్స్ తో అభిప్రాయ సేకరణను నిర్వహించింది. ఈ ఓపినీయన్ పోల్ లో.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) రికార్డు తేడాతో అధికారాన్ని నిలుపుకుంటుందని,కాంగ్రెస్ రెండో ప్లేస్ లో నిలుస్తుందని తేలింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం పెద్దగా ఉండబోదని ఈ ఓపినియన్ పోల్ లో తేలింది.

ఇండియా టివి-మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ ప్రకారం... 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 117 సీట్లను గెలుచుకోవచ్చు, కాంగ్రెస్ 59 సీట్లు, ఆప్ 4 సీట్లు మరియు ఇతరులు 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ.. సెంట్రల్ గుజరాత్ ప్రాంతంలో 54% ఓట్లతో 43 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు 17 సీట్లు వస్తాయని అంచనా. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడంలో విఫలమవుతుందని, ఇతరులు ఒక సీటు పొందవచ్చని ఇండియా టీవీ-మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ తెలిపింది. ఉత్తర గుజరాత్ ప్రాంతంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనా వేసింది. ఈ ప్రాంతంలోని 32 సీట్లలో... బీజేపీకి 15 సీట్లు, కాంగ్రెస్‌కు 17 సీట్లు వచ్చే అవకాశం ఉందని. ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ప్రాంతంలో ఏ ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని తెలిపింది. దక్షిణ గుజరాత్ విషయానికి వస్తే.. బీజేపీకి 26 సీట్లు, కాంగ్రెస్‌కు 6, ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 2 సీట్లు రావచ్చు. ఈ ప్రాంతంలో బీజేపీకి 50%, కాంగ్రెస్‌కి 36%, ఆప్‌కి 12%, ఇతరులకు 2% ఓట్లు వస్తాయని అంచనా. సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలోని మొత్తం 54 సీట్లలో... 33 స్థానాలు గెలుచుకుని బీజేపీ అతిపెద్ద ప్లేయర్‌గా అవతరించే అవకాశం ఉందని, కాంగ్రెస్ 19, ఆప్ 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని.. ఓట్ల శాతం విషయానికొస్తే, బీజేపీకి 48%, కాంగ్రెస్‌కు 40%, ఆప్‌కి 11% ఓట్లు వస్తాయని అంచనా వేసింది.. సౌరాష్ట్ర ప్రాంతంలో, వెనుకబడిన ఓటర్లు బిజెపికి 53% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నందున బిజెపితో కలిసి వెళ్లాలని భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు 39%, ఆప్‌కి 5% ఓట్లు వచ్చాయి.

Rahul Gandhi: మళ్లీ అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..

ఇండియాటీవీ-మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ ప్రకారం ...గుజరాత్ లో ముస్లింలు ఆప్, అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని AIMIM కంటే కాంగ్రెస్‌ను ఎంచుకుంటారని తేలింది. కేవలం 10% మంది ముస్లింలు బీజేపీకి, 60% మంది కాంగ్రెస్‌కు, 25% మంది ఆమ్ ఆద్మీ పార్టీకి, మరికొందరు 5% మంది ఓటు వేస్తారని సర్వేలో తేలింది.

First published:

Tags: AAP, Bjp, Congress, Gujarat Assembly Elections 2022

ఉత్తమ కథలు