రాయలసీమకు రాజధానిని కేటాయించాలంటూ సీఎం జగన్‌కు, హైపవర్ కమిటీకి గ్రేటర్ రాయలసీమ మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు లేఖ రాశారు. రాయలసీమ వాసుల సెంటిమెంట్‌ను గుర్తించి రాజధానిని రాయలసీమకు కేటాయించాలని కోరారు. సీమ ప్రాంతంలో వెనుకబాటుతనం, గత ప్రభుత్వాల మోసాల వల్ల ఇక్కడి ప్రజలు ఎంతో నష్టపోయారని, ప్రధాన ప్రాజెక్టుల ఏర్పాటులోనూ రాయలసీమ వాసులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా త్యాగాలు చేశారని లేఖలో వారు పేర్కొన్నారు. ఈ ప్రాంత వాసుల త్యాగాలు మనోభావాలు, ఆత్మగౌరవాన్ని సీఎం, హైపవర్ కమిటీ గుర్తించి న్యాయం చేయాలని విన్నవించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Ap capital, Ap cm ys jagan mohan reddy, AP News, Rayalaseema