చిన్నప్పుడు.. మనకు చదువు చెప్పే గురువులు, పెద్దలు ఓమాట అంటుండేవారు. సరిగ్గా చదువుకోరా లేదంటే ఏ టీకొట్టో, పచారీ కొట్టో పెట్టుకొని బతకాలి అని. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అప్పట్లో చదువు అబ్బక కొందరు వ్యాపారాలు చేస్తుండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.... డిగ్రీలు, పీజీలు, ఇంజినీరింగ్ ఇలా పెద్ద పెద్ద చదువులు వారు సైతం బిజినెస్ పెడుతున్నారు. ఇలానే ఓ అమ్మాయి డిగ్రీ చదివి.. టీకొట్టు పెట్టింది. బీహార్ పాట్నా గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ... ప్రియాంక గుప్తా. ఈ పేరు అక్కడి వారికి బాగా సుపరిచితమే. పాట్నాలోని పాతబస్తీలోని ఉమెన్స్ కాలేజీ ఎదురుగా టీ స్టాల్ పెట్టి వార్తల్లోకి ఎక్కింది ప్రియాకం. అనంతరం బోరింగ్ రోడ్డులో తన స్టాల్‌ను ఏర్పాటు చేశారు.
ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ టీ మాత్రమే కాకుండా రుచికరమైన వంటకాలను కూడా అందిస్తోంది. గ్రాడ్యుయేట్ టీ అమ్మకందారుడు ఇప్పుడు టీ బండి పక్కన పెట్టి తన స్వంత రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ కొత్త షాపులో మనకు రుచిగల టీ మాత్రమే కాకుండా, తినడానికి , త్రాగడానికి రుచికరమైన పదార్థాలు కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రియాంక గుప్తా మాట్లాడుతూ... తనకు గుర్తింపు రావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. తాను టీ స్టాల్‌ను ఏర్పాటు చేసినప్పుడు, మీడియా దానిని బాగా కవర్ చేసిందని ఆమె చెప్పింది. దీని ఫలితంగా చలా దూర ప్రాంతాల ప్రజలు అక్కడకు వచ్చి తన టీ తాగారని.. తనకు అలా చాలామంది పరిచయం అయ్యారని చెప్పింది. కానీ కార్పొరేషన్ అధికారులు.. ఆక్రమణల నివారణ చర్యల్లో భాగంగా తన టీ బండిని చాలాసార్లు ఎత్తివేసారని తెలిపింది.
ఈ ఘటన తర్వాత ఆమె సోషల్ మీడియాలో కూడా ఏడుస్తూ కనిపించింది. కానీ కుంగిపోకుండా ఆమె మరోసారి కొత్తగా ఆలోచింది కొత్త రెస్టారెంట్ ఒపెన్ చేసింది. ప్రియాంక ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్. ప్రియాంక గుప్తా బీహార్‌లోని పూర్నియా జిల్లా నివాసి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో పట్టభద్రురాలు. చదువు పూర్తయ్యాక సాధారణ పోటీల విభాగంలో పలు పోటీ పరీక్షల్లో కూడా పాల్గొనింది. కానీ ఆ రంగంలో ఆమెకు సక్సెస్ రాలేదు. ఆ తర్వాత స్వయం ఉపాధిని ప్రారంభించింది. అందుకే ప్రియాంకను అక్కడివారంతా గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ అనే పేరు కూడా పెట్టారు. అప్పటి నుంచి ఆమె టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ప్రియాంక పాట్నాలోని బోరింగ్ రోడ్‌లోని హరిహర్ ఛాంబర్ ఎదురుగా పాండుయి ప్యాలెస్ బేస్‌మెంట్‌లో తన రెస్టారెంట్‌ను ప్రారంభించింది. అక్కడి చెఫ్ బైజు కుమార్ మాట్లాడుతూ.. ఇక్కడ రుచిగల టీతో పాటు, మోమోలు, బర్గర్లు, రోల్స్ మరియు బిర్యానీ వంటి అన్ని రకాల ఫుడ్ కూడా ఈ రెస్టారెంట్‌లో ఉంచారన్నారు. కస్టమర్‌కు తమ ఆహారం నచ్చకపోతే, 100 శాతం డబ్బు కూడా తిరిగి ఇస్తారని అతడు తెలిపాడు. ఈ రెస్టారెంట్‌లో చెఫ్ బైజు కుమార్ కూడా ఓ భాగస్వామి. తమ ఆహార పదార్థాల్లో విదేశీ కూరగాయలు కలుపుతారని, దీంతో రుచి పెరుగుతుందని అతను తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.