హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

రాఫెల్ డీల్‌పై నేడు పార్లమెంటు ముందుకు కాగ్ నివేదిక..

రాఫెల్ డీల్‌పై నేడు పార్లమెంటు ముందుకు కాగ్ నివేదిక..

ప్రతీకాత్మక చిత్రం..

ప్రతీకాత్మక చిత్రం..

రాఫెల్‌పై కాగ్ నివేదిక ఇచ్చిన విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదని.. పీఏసీ పరిశీలనకు ఆ రిపోర్ట్ ఎందుకు పంపించలేదని కాంగ్రెస్ గతంలో ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు రాఫెల్ డీల్‌పై కాగ్ నివేదికను కేంద్రం పార్లమెంటు ముందు ఉంచనుంది.

  రాఫెల్ డీల్ వివాదంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ సర్కార్.. నేడు కాగ్ నివేదికను పార్లమెంట్ దృష్టికి తీసుకురానుంది. లోక్‌సభ సమావేశాల ముగింపుకు ఒకరోజు ముందు కేంద్రం కాగ్ నివేదికను పార్లమెంట్ ముందు పెడుతుండటం గమనార్హం. రాఫెల్‌పై కాగ్ నివేదిక ఇచ్చిన విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదని.. పీఏసీ పరిశీలనకు ఆ రిపోర్ట్ ఎందుకు పంపించలేదని కాంగ్రెస్ గతంలో ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు రాఫెల్ డీల్‌పై కాగ్ నివేదికను కేంద్రం పార్లమెంటు ముందు ఉంచనుంది.

  ఫ్రాన్స్‌ కంపెనీ డసాల్ట్‌‌తో 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ తొలి నుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. యూపీఏ హయాంలో 126 యుద్ద విమానాల కొనుగోలు కోసం రూ.526కోట్ల ఫ్రాన్స్ కంపెనీతో ఒప్పందం జరిగితే.. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేసింది. 36 యుద్ద విమానాల కోసం రూ.58వేల కోట్లతో ఎన్డీయే సర్కార్ కొత్త ఒప్పందం కుదుర్చుకుంది.

  యూపీఏ హయాంలో కుదిరిన డీల్‌కు, మోదీ హయాంలో కుదిరిన డీల్‌కు భారీ వ్యత్యాసం ఉండటం.. హెచ్ఏఎల్ లాంటి కంపెనీని కాదని ప్రైవేట్ కంపెనీకి దాన్ని అప్పగించడంపై కాంగ్రెస్ అనుమానాలు లేవనెత్తుతోంది. మోదీ జోక్యం చేసుకుని మరీ సదరు సంస్థకు కాంట్రాక్టు దక్కేలా చేశాడని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో రాఫెల్ డీల్‌కు సంబంధించిన ఖర్చులపై కాగ్ రిపోర్ట్‌లో ఏం వెల్లడి కానుందన్న ఆసక్తి నెలకొంది.

  Published by:Srinivas Mittapalli
  First published:

  Tags: Narendra modi, Parliament, Rafale Deal

  ఉత్తమ కథలు