హోమ్ /వార్తలు /national /

tirupati by poll: పవన్ అభిమానులకు గుడ్ న్యూస్. వారి కోరిక నెరవేరింది

tirupati by poll: పవన్ అభిమానులకు గుడ్ న్యూస్. వారి కోరిక నెరవేరింది

పవన్ కల్యాణ్ (File/Photo)

పవన్ కల్యాణ్ (File/Photo)

తిరుపతి ఉప ఎన్నికకు ముందు బీజేపీ, జనసేన పోరాటం ఫలించింది. ఇది ఉప ఎన్నిక గెలుపులో తొలి మెట్టు అంటున్నారు. రాబోయే ఎన్నిక ఫలితాల్లోనూ వైసీపీకి ఇలాంటి చేదు అనుభవమే ఎదురవుతుంది అంటూ బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

  జనసేన, పవన్ అభిమానులకు గుడ్ న్యూస్..  పవన్ అభిమానుల కోరిక నెగ్గింది. ఇటు బీజేపీ ఫైటింగ్ ఫలించింది. దీంతో ఇటు బీజేపీ అటు జనసేన అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. సగం గెలుపు ఖాయమంటున్నారు. ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో తమను ఎవరూ ఆపలేరంటూ దూసుకుపోతున్నారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా.. న్యాయమే నెగ్గింది అంటున్నారా?.. ఇంతకీ అంత ఆనందం ఎందుకు అనుకుంటున్నారు. ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారాల కంటే గాజు గ్లాసు గుర్తే హైలైట్ అవుతూ వచ్చింది.

  సాధరణంగా జనసేన పార్టీకి గతంలోనే గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికలో జనసేన నేరుగా బరిలో దిగడం లేదు. మిత్ర పక్షం బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలిపింది. జనసేన బరిలో లేకపోవడంతో గాజు గ్లాసు గుర్తును నవతరం అనే పార్టీకి కేటాయించింది ఎన్నికల సంఘం.. అక్కడి నుంచి వివాదం మొదలైంది. రాష్ట్రంలో అధికార పార్టీనే ఈ కుట్ర చేసిందని.. తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి భయంతో.. జనసేన గుర్తును వేరే వారికి కేటాయించింది అంటూ ఇటు బీజేపీ, అటు జనసేన నేతలు, కార్యకర్తలు మండిడుతూ వచ్చారు.

  కేవలం విమర్శలతోనే సరిపెట్టుకోకుండా పోరాటం చేసింది బీజేపీ.  ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ- జనసేన నేతల ప్రతినిధి బృందం కలిసింది. నవతరం పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై బీజేపీ, జనసేన నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గతంలో జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించిన సంగతి గుర్తు చేశారు. అలాగే తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి బరిలో ఉన్నప్పుడు జనసేన గుర్తును వేరే పార్టీకి కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

  బీజేపీ, జనసేన ఫిర్యాదును స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే దీనిపై చర్య తీసుకుంది. నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును వెంటనే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇటు బీజేపీ అటు జనసేన నేతలు, అభిమానులు తమ వాదనే నెగ్గింది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ అరచకానికి మొదటిలోనే అడ్డుకట్ట వేశామని.. తిరుపతి ఉప ఎన్నికలో విజయానికి ఇదే తమ తొలి మెట్టు అంటున్నారు.

  ఎన్నికలకు ఇప్పుడు పెద్దగా సమయం లేదు. ఇప్పటికే నవతరం పార్టీ అభ్యర్థి తన గాజు గ్లాసు గుర్తుపై  ఓటు వేయాలని ప్రచారం కూడా నిర్వహించారు. దీంతో అతడు కూడా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. మరి దీనిపై ఎన్నికల సంఘం ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Bjp-janasena, Janasena, Pawan kalyan, Tirupati, Tirupati Loksabha by-poll

  ఉత్తమ కథలు