హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Gulam Nabi Azad New Party : కొత్త పార్టీ పేరు ప్రకటించిన గులాంనబీ ఆజాద్,పార్టీ జెండా అదే

Gulam Nabi Azad New Party : కొత్త పార్టీ పేరు ప్రకటించిన గులాంనబీ ఆజాద్,పార్టీ జెండా అదే

పార్టీ జెండా పట్టుకొని ఉన్న ఆజాద్(Image credit : ANI)

పార్టీ జెండా పట్టుకొని ఉన్న ఆజాద్(Image credit : ANI)

Gulam Nabi Azad Party Name : ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్(Gulam Nabi Azad) ఇవాళ తన కొత్త పార్టీ పేరుని ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Gulam Nabi Azad Party Name : ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్(Gulam Nabi Azad) ఇవాళ తన కొత్త పార్టీ పేరుని ప్రకటించారు. ఆగస్టు 26న కాంగ్రెస్ తో ఐదు దశాబ్దాలుగా ఉన్న తన అనుబంధాన్ని తెంచుకున్న ఆజాద్..ఖచ్చితంగా నెల రోజుల తర్వాత ఇవాళ(సెప్టెంబర్ 26,2022)తన కొత్త పార్టీ పేరుని "డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ(Democratic Azad Party)"అని ప్రకటించారు.  పార్టీకి ఏజ్ బార్ ఉండదని,యువకులు- అనుభవజ్ఞులు పార్టీలో కలిసి ఉంటారని ఆజాద్ చెప్పారు. "నా కొత్త పార్టీ కోసం దాదాపు 1,500 మంది పేర్లను ఉర్దూ, సంస్కృతంలో మాకు పంపారు. హిందీ- ఉర్దూ కలయిక 'హిందుస్తానీ'. పేరు ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా స్వతంత్రంగా ఉండాలని మేము కోరుకున్నాం"అని ఆజాద్ చెప్పారు.

నీలం, తెలుపు, ఆవరంగులతో కూడిన పార్టీ జెండాను  కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు గులాం నబీ ఆజాద్. తన కొత్త పార్టీ జెండాలోని ఆవాల రంగు సృజనాత్మకత & భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుందని తెలుపు శాంతిని సూచిస్తుందని, నీలం.. స్వేచ్ఛ, బహిరంగ ప్రదేశం, ఊహ,సముద్రపు లోతుల నుండి ఆకాశం యొక్క ఎత్తుల వరకు ఉన్న పరిమితులను సూచిస్తుంది అని ఆజాద్ తెలిపారు.

Katrina Viral Video : అరబిక్ కుతు పాటకి స్కూల్ పిల్లలతో కలిసి కత్రినా డ్యాన్స్..వీడియో వైరల్

గులాం నబీ ఆజాద్... 1973 నుంచి గత నెల వరకు కాంగ్రెస్‌లో పనిచేస్తూ వచ్చారు. 1980 అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో లోక్‌సభకు ఎన్నికయ్యాక కేంద్ర మంత్రివర్గంలో కూడా చేరారు. 2005 నుంచి 2008 వరకు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2021 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Ghulam Nabi Azad, Jammu and Kashmir

ఉత్తమ కథలు