హోమ్ /వార్తలు /national /

GHMC Mayor Election: మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారు.. టీఆర్ఎస్ ఏం చేయబోతోంది?

GHMC Mayor Election: మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారు.. టీఆర్ఎస్ ఏం చేయబోతోంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56 స్థానాలు గెలిచింది. ఆ పార్టీకి ఉన్న ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య 37. మొత్తం కలిపితే టీఆర్ఎస్ బలం 93. కానీ మేయర్ పీఠం దక్కాలంటే..మరో 9 మంది సభ్యుల మద్దతు అవసరం.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)కు కొత్త మేయర్ రాబోతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారయింది. మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు.. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. అనంతరం 12.30 నిమిషాలకు మేయర్ ఎన్నిక, ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపడతారు. ఎన్నికల పర్యవేక్షణకు ఐఏఎస్ స్థాయి అధికారిని ఎన్నికల సంఘం నియమించింది. ఏదైనా కారణాలతో ఎన్నిక నిర్వహించలేని పక్షంలో ఫిబ్రవరి 12న ఎన్నిక నిర్వహిస్తారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడి 40 రోజులపైనే అయింది. ఐతే ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో.. ఈసారి మేయర్ ఎవరవుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు గత ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరిగాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ 56 వార్డులు గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. 48 వార్డులు గెలిచి బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఇక పాతబస్తీలో మరోసారి సత్తా చాటిన ఎంఐఎం 44 వార్డులు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లకే పరిమితమయింది. బీజేపీ భారీగా వార్డులను గెలవడంతో టీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ నెలకొంది.

మొత్తం 52 మంది ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే మేయర్ ఎన్నికలో ఓటువేసే వారి సంఖ్య 202కి చేరనుంది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 102 మేజిక్ ఫిగర్ అవసరం ఉంటుంది. మొత్తం 52 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో టీఆర్‌ఎస్‌కు అధికంగా 37, బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఒక్కరు, ఎంఐఎంకు 10 మంది ఉన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56 స్థానాలు గెలిచింది. ఆ పార్టీకి ఉన్న ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య 37. మొత్తం కలిపితే టీఆర్ఎస్ బలం 93. కానీ మేయర్ పీఠం దక్కాలంటే.. మరో 9 మంది సభ్యుల మద్దతు అవసరం. మరి టీఆర్ఎస్ ఏం చేయబోతోంది? మేయర్ పీఠాన్ని ఎలా కైవసం చేసుకోబోతోంది? ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్.

ఎన్నికల వేళ టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం జరిగింది. ఫ్రెండ్లీ పార్టీలైన టీఆర్ఎస్, ఎంఐఎం కూడా నువ్వా నేనా అన్నట్లుగా విమర్శలు గుప్పించుకున్నాయి. తాము తలచుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలుతుదని ఎంఐఎం నేతలు వ్యాఖ్యానించడంతో రెండు పార్టీల మధ్య గ్యాంప్ కొంత పెరిగింది. ఇక టీఆర్ఎస్‌కు బీజేపీ ఎలాగూ మద్దతు ఇచ్చే అవకాశమే లేదు. ఐతే టీఆర్ఎస్, ఎంఐఎంల గొడవ ఎన్నికల వరకేనని.. ఆ తర్వాత మళ్లీ కలుస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రేటర్ పీఠం కోసం టీఆర్ఎస్, ఎంఐఎంలు చేతులు కలపడమో లేక టీఆర్ఎస్‌కు ఎంఐఎం బయటి నుంచి మద్దతు ఇవ్వడమో జరగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీఆర్ఎస్‌ ఒకవేళ మేయర్ పీఠం దక్కితే కొత్త మేయర్ ఎవరన్న దానిపైనా నగరవాసులు చర్చించుకుంటున్నారు. ఐతే ఎన్నికల ఫలితాల రోజే సింధు రెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది. భారతీనగర్ డివిజన్ నుంచి గెలిచిన ఆమె.. మేయర్ రేసులో ముందు వరుసలో ఉన్నారు.

భారతినగర్ డి

First published:

Tags: GHMC Election Result, Hyderabad - GHMC Elections 2020

ఉత్తమ కథలు