Home /News /national /

POLITICS GHMC ELECTIONS AIMIM VS AIMIM BATTLE OVER NAME SENT TO SEC BA

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో AIMIM వర్సెస్ AIMIM

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఈ సారి మరో వెరైటీ సీన్ కనిపించనుంది. అదే ఏఐఎంఐఎం వర్సెస్ ఏఐఎంఐఎం.

    గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఈ సారి మరో వెరైటీ సీన్ కనిపించనుంది. అదే ఏఐఎంఐఎం వర్సెస్ ఏఐఎంఐఎం. అదేంటి ఒక పార్టీ, మరో పార్టీతో ఢీ కొడుతుంది కానీ, అదే పార్టీ మధ్య ఫైట్ ఎలా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఇక్కడ ఏఐఎంఐఎం అంటే ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, మరో ఏఐఎంఐఎం అంటే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ మిల్లత్. హైదరాబాద్‌ పాతబస్తీలో పోటీకి మరో పార్టీ సన్నద్ధం అవుతోంది. ఈ పార్టీ కూడా ఏఐఎంఐఎం పేరుతోనే రాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన వివాదం నడుస్తోంది. ప్రస్తుతం ఈ పేరు వ్యవహారం కోర్టులో ఉంది. ఆ పేరుతో రిజిస్టర్ చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేసుకోగా, దాన్ని తిరస్కరించింది. దీనిపై మిల్లత్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత పిటిషనర్ మరో పేరును సూచించారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇంక్విలాబ్ ఈ మిల్లత్ గా పేరు మార్చింది. అంటే షార్ట్ కట్‌లో అది కూడా ఏఐఎంఐఎంగానే ఉంది. కానీ, దీనికి కూడా ఎస్ఈసీ అభ్యంతరం తెలిపింది. అయితే, తాము ఏఐఎంఐఎం (ఇంక్విలాబ్‌)గా పిలుస్తామని ఆ పార్టీ తరఫున న్యాయవాది హైకోర్టుకు సూచించారు. ఈ క్రమంలో పార్టీ పేరు చివర ‘ఇంక్విలాబ్’ పేరు చేర్చేందుకు ఆ పార్టీ అంగీకరించింది కాబట్టి, ఫైనల్ డెసిషన్ తీసుకోవాలంటూ ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది.

    తెలంగాణ రాష్ట్రంలో నాలుగు గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. అందులో హైదరాబాద్ పాత బస్తీలో అన్ని పార్టీలు పోటీ చేస్తాయి. ఎంఐఎం, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓల్డ్ సిటీలోని అన్ని డివిజన్లలో పోటీ చేశాయి. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం 60 సీట్లలో పోటీ చేసింది. 44 చోట్ల గెలుపొందింది. అయితే, ఈసారి మరికొన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోంది. 150 సీట్లు ఉన్న జీహెచ్ఎంసీలో ఈసారి ఎంఐఎం గట్టిగానే పోటీ చేయాలని చూస్తుంది.  హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చే పార్టీ. కానీ, ఆ పార్టీ పెద్దగా ప్రభావితం చూపలేకపోతోంది. ఆ పార్టీకి ప్రతి డివిజన్లోనూ పోటీ చేసే అభ్యర్థులు కూడా సరిగా దొరకడం లేదు.

    2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. 99 మంది కార్పొరేటర్లు గెలుపొందారు. ఎంఐఎం 44 సీట్లలో గెలిచింది. టీడీపీ కేవలం ఒక్కచోట గెలుపొందింది. బీజేపీ 4 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 2 సీట్లలో విజయం సాధించింది.

    GHMC Election Schedule
    నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: నవంబర్ 18
    నామినేషన్ల స్వీకరణకు ఆఖరు తేదీ: నవంబర్ 20నామినేషన్ల పరిశీలన: నవంబర్ 21
    నామినేషన్ల విత్ డ్రా: నవంబర్ 22, సాయంత్రం 3 గంటల వరకు
    తుది జాబితా ప్రకటన: నవంబర్ 22 సాయంత్రంఎన్నికల తేదీ: డిసెంబర్ 1 ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు..
    రీ పొలింగ్(అవసరమైన చోట మాత్రమే): డిసెంబర్ 3
    కౌంటింగ్: డిసెంబర్ 4 ఉదయం 7 గంటల నుంచి

    పోలింగ్ స్టేషన్ల వివరాలు:
    మొత్తం పోలింగ్ స్టేషన్లు: 9238(నవంబర్ 21న తుది జాబితా)
    సమస్యాత్యక పోలింగ్ స్టేషన్లు: 1439
    అత్యంత సమస్యాత్మకం: 1004
    మొత్తం వార్డులు: 150
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Hyderabad - GHMC Elections 2020, MIM

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు