హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Video : యేసు క్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు శక్తి కాదు..పాస్టర్ తో రాహుల్ సంభాషణ వైరల్

Video : యేసు క్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు శక్తి కాదు..పాస్టర్ తో రాహుల్ సంభాషణ వైరల్

వివాదాస్పద పాస్టర్ తో రాహుల్

వివాదాస్పద పాస్టర్ తో రాహుల్

George Ponnaiah-Rahul Gandhi Video : బీజేపీ(BJP)నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలను ఎదుర్కోవడానికి, దేశ, ప్రజా సమస్యలను మరింత లోతుగా తెలుసుకునేందుకంటూ కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర(BHARAT JODO YATRA)పేరిట భారీ పాదయాత్ర కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

George Ponnaiah-Rahul Gandhi Video : బీజేపీ(BJP)నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలను ఎదుర్కోవడానికి, దేశ, ప్రజా సమస్యలను మరింత లోతుగా తెలుసుకునేందుకంటూ కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర(BHARAT JODO YATRA)పేరిట భారీ పాదయాత్ర కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల పాదయాత్రను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)సెప్టెంబర్ 7న కన్యాకమారిలో ప్రారంభించారు. 150 రోజుల పాటు సాగే పాదయాత్రలో 12 రాష్ట్రాలను కవర్ చేయనున్నారు. ఈ యాత్రలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేయనున్నారు. పలు ప్రాంతాల్లో ర్యాలీలు, బహిరంగ సభలు ఉంటాయి. అయితే భారత్​ జోడో పేరిట పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ తమిళనాడు(Tamilnadu)లో ఓ వివాదాస్పద పాస్టర్​ను కలవడం విమర్శలకు తావిచ్చింది.

భారత్​ జోడో యాత్ర పేరిట చేస్తున్న 150 రోజుల పాదయాత్రలో భాగంగా శుక్రవారం(పెస్టెంబర్9,2022) కన్యాకుమారి జిల్లా పులియూర్​కురిచిలోనిముట్టిదిచాన్ పారై చర్చిలో వివాదాస్పద కేథలిక్ మత గరువు జార్జ్ పూనయ్య(George Ponnaiah)ను రాహుల్ గాంధీ కలిశారు.  ఈ సందర్భంగా రాహుల్ గాంధీ... యేసు క్రీస్తు(Jesus)దేవుడా? దేవుని రూపమా? అని జార్జ్ పూనయ్యను అడుగగా దానికి జార్జ్ స్పందిస్తూ.. "యేసు మాత్రమే అసలైన దేవుడు. దేవుడు ఒక నిజమైన మనిషిలానే అవతరిస్తాడు. "శక్తి"లా కాదు. అందుకే మనం మనిషినే చూస్తాం"అని బదులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వైరల్ వీడియోపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహ్​జాద్ పూనావాలా మాట్లాడుతూ.. "మతదురభిమానంతో కొన్ని వ్యాఖ్యలు చేసినందుకు జార్జ్ పూనయ్య గతంలో అరెస్ట్ అయ్యారు. భారత్​ తోడో(దేశాన్ని విడగొట్టే) శక్తులతో కలిసి భారత్​ జోడో(భారత్​ను ఐక్యం చేసే) యాత్ర చేస్తారా? అని రాహుల్​ను ప్రశ్నించారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ నిద్రించే కంటైనర్ ఇదే.. ఏమేం సదుపాయాలు ఉన్నాయో తెలుసా?

అయితే ఈ విమర్శల్ని కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఆడియోకు, అక్కడ జరిగినదానికి ఏమాత్రం సంబంధం లేకుండా బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడింది. మరోవైపు పలువురు,నెటిజన్లు కూడా పాస్టర్ జార్జ్ పొన్నయ్యను కలవడంపై రాహుల్ గాంధీని తప్పుబడుతున్నారు. రాహుల్ గాంధీ హృదయం స్వచ్ఛమైన వాటికన్ అని. ఇలాంటి ఇటాలియన్ వ్యక్తి, భారతదేశానికి పొంచి ఉన్న ముప్పును చూడలేని హిందువులు ఉన్నందుకు బాధపడుతున్నాను అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

First published:

Tags: Bharat Jodo Yatra, Jesus, Rahul Gandhi, Viral Video

ఉత్తమ కథలు