వల్లభనేని వంశీమోహన్ వైసీపీలో చేరుతారని దాదాపుగా ఖారరు అయిపోయింది. శుక్రవారం ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ కావడంతో వైసీపీలో వంశీ చేరుతారా లేదా అన్న సస్పెన్స్‌కు తెరదించినట్లైంది. అయితే ఇప్పుడు వైసీపీలో కొత్త రచ్చ మొదలయ్యింది. వల్లభనేని వంశీ వైసీపీలో చేరడాన్ని ఆపార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు, నేతలు వ్యతిరేకిస్తున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ నుంచి పోటీ చేసి వల్లభనేని గెలిచిన గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ నివాసానికి చేరుకున్నారు.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారంటూ వస్తున్న వార్తలపై ఆయన రాకను నిరసిస్తూ పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు గన్నవరం వైసీపీ ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు నివాసాని వెళ్లారు. వంశీ వస్తే వైసీపీకి డ్యామేజ్ తప్పదని అంటున్నారు. ఒకవేళ వంశీని వైసీపీలోకి తీసుకుంటే.. భవిష్యత్తు కార్యాచరణపై యార్లగడ్డ ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics, TDP, Vallabhaneni vamsi, Ysrcp