Congress rallies behind Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్(National Herald)మనీలాండరింగ్(Money Laundering)కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) సోమవారం(జూన్ 13)ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో "ఈడీ(Enforcement Directorate)నోటీసుకు మరియు నియంత యొక్క అహంకారానికి రాహుల్ గాంధీ భయపడరు" అని కాంగ్రెస్ ఆదివారం రాత్రి ఒక ట్వీట్లో పేర్కొంది. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆదివారం ఆరోపించింది. తమ మాజీ పార్టీ అధినేత వెనక్కి తగ్గరని పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు ఎంపీలు పేర్కొన్నారు. ఈడీ చర్య "నిరాధారమైనది" అని కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం పేర్కొన్నారు. అది పర్సు లేనప్పుడు పర్సు లాక్కున్నాడని ఆరోపించడం లాంటిదని చిదంబరం అన్నారు. ఈడీ అధికార పరిధి బిజెపి సభ్యులకు లేదా అది పాలించే రాష్ట్రాలకు విస్తరించదని తెలుస్తోందని వంగ్యాస్త్రాలు సంధించారు చిదంబరం. కాగా,లక్నోలో సచిన్ పైలట్, రాయ్‌పూర్‌లో వివేక్ తంఖా, భోపాల్‌లో దిగ్విజయ్ సింగ్, సిమ్లాలో సంజయ్ నిరుపమ్, చండీగఢ్‌లో రంజీత్ రంజన్, అహ్మదాబాద్‌లో పవన్ ఖేరా, డెహ్రాడూన్‌లో అల్కా లాంబా రాహుల్ గాంధీకి సంఘీభావం తెలిపేందుకు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే ఇది అని ఆరోపించారు.
ఇక,సోమవారం రాహుల్ ఈడీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో రాహుల్‌కు మద్దతుగా అక్బర్ రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు ఆ రోజు భారీ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించాయి. ఈ మేరకు పార్టీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, సీనియర్ నాయకులకు సమాచారం కూడా అందింది. అంతేకాక రాష్ట్రాల్లోనూ ఆ రోజు పలు కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా ఈనెల 2నే ఈడీ విచారణకు హాజరుకావాల్సింది. కానీ విదేశాల్లో ఉన్న కారణంగా హాజరు కాలేనని రాహుల్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈనెల 13న విచారణకు హాజరవ్వాలని ఈడీ తెలిపింది. దీంతో జూన్ 13న ఈడీ విచారణకు హాజరుకానున్నారు రాహుల్ గాంధీ.
ప్రజలు ఆగ్రహిస్తే అంతే : తమ మాట పట్టించుకోవట్లేదని..అధికార పార్టీ ఎమ్మెల్యేనే బంధించిన గ్రామస్తులు!
Shocking : ఫుల్ గా మందుకొట్టి ఇంటికొచ్చిన సాఫ్ట్ వేర్..భార్యతో ఆ విషయమై గొడవ..అనంతరం దారుణం
నేషనల్ హెరాల్డ్ కేసు
కాంగ్రెస్ లోని కొంతమంది నేతలతో కలిసి జవహర్ లాల్ నెహ్రూ 1938లో నేషనల్ హెరాల్డ్(National Herald) అనే న్యూస్ పేపర్ ను ప్రారంభించారు. దీనిని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ పబ్లిష్ చేసేది. స్వాతంత్ర పోరాటంలో ఎన్నో కథనాలను స్ఫూర్తిదాయక కథనాలను అందించి స్వాతంత్య్ర కాంక్షను రేపింది. కాలక్రమేణా ఈ పేపర్ కాంగ్రెస్ పత్రికగా ప్రజల్లో ఓ ముద్ర పడింది. స్వాతంత్య్రం అనంతరం ఈ న్యూస్ పేపర్ అధికార న్యూస్ పేపర్ గా చలామణి అయింది. తీవ్ర నష్టాల క్రమంలో 2008లో ఈ పేపర్ ను మూసివేశారు. పబ్లిక్ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)ను యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఈఎల్) అనే ప్రైవేట్ సంస్థకు తక్కువ మొత్తానికే కట్టబెట్టారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఫిర్యాదు చేశారు.
ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను యంగ్ ఇండియా లిమిటెడ్ సొంతం చేసుకుందని... ఈ క్రమంలోనే దాదాపు రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులను రాహుల్ గాంధీ డైరెక్టర్ గా ఉన్న వైఈఎల్ సంస్థ అక్రమంగా పొందిందని పేర్కొన్నారు. ఈ కేసు విషయమై 2014లో ఈడీ విచారణ చేపట్టింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో సీనియర్ కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ కోశాధికారి పవన్ బన్సాల్లను ఈడీ ప్రశ్నించింది. ఖర్గే వైఐఎల్ సీఈఓగా ఉండగా, బన్సాల్ ఏజేఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.YIL ప్రమోటర్లలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.