G-7 Summit: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi) ప్రస్తుతం జపాన్ లోని హిరోషిమాలో పర్యటిస్తున్నారు. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా జరిగే G-7 దేశాల సదస్సులో మోదీ (Pm Modi) పాల్గొన్నారు. ఈ సమ్మిట్ లో భారత్, జపాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేషియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, ఇటలీ, దక్షిణ కొరియా, వియత్నం సహా పలు దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో సమ్మిట్ లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.
సమ్మిట్ లో భాగంగా తనకు కేటాయించిన సిటీలో కూర్చున్న ప్రధాని మోదీ (Pm Modi) వద్దకు స్వయంగా అమెరికా అధ్యక్షులు వచ్చారు. ఆయన రాకను గమనించిన మోదీ లేచి జో బైడెన్ (Joe Byden) ను పలకరించారు. ఆ తరువాత ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కౌగిలించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అలాగే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) కూడా ప్రధాని మోదీని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్బంగా వారి మధ్య కొంతసేపు సంభాషణ కూడా జరిగింది.
ఇక అంతకుముందు హిరోషిమా పట్టణంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం దొరకడం తన అదృష్టమని..హిరోషిమా అనే పదం వింటేనే ఇప్పటికి ప్రపంచం భయపడుతుందన్నారు. తాను జపాన్ ప్రధానికి బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని హిరోషిమాలో నాటారని తెలిసి హర్షం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ విగ్రహం అహింసా సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని మోదీ ఆకాక్షించారు.
ఈ సమ్మిట్ లో కనెక్టివిటీ, భద్రతా, అణు నిరాయుధీకరణ, ఆర్ధిక భద్రతా , వాతావరణ మార్పులు, ఆహరం, ఆరోగ్యం, ప్రాంతీయ సమస్యలు వంటి అంశాలతో పాటు కొన్ని ప్రాధాన్యత అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పుకొచ్చారు.
Prime Minister Narendra Modi and US President Joe Biden share a hug as they meet in Hiroshima, Japan.#pmmodi #joebiden #japan #g7summit #hiroshima #g7 pic.twitter.com/u6DoXpb8Wl
— News18 (@CNNnews18) May 20, 2023
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Modi, Narendra modi, Pm modi, PM Narendra Modi