హోమ్ /వార్తలు /జాతీయం /

‘ఇంత దిగజారాలా?’: రాహుల్ గాంధీకి మనోహర్ పారికర్ లేఖాస్త్రం

‘ఇంత దిగజారాలా?’: రాహుల్ గాంధీకి మనోహర్ పారికర్ లేఖాస్త్రం

రాహుల్ గాంధీ, మనోహర్ పారికర్

రాహుల్ గాంధీ, మనోహర్ పారికర్

రాహుల్ గాంధీతో జరిగిన ఐదు నిమిషాల భేటీలో రాఫెల్ డీల్ గురించిన ప్రస్తావన ఏదీ రాలేదని మనోహర్ పారికర్ స్పష్టం చేశారు.

  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి గోవా సీఎం మనోహర్ పారికర్ బహిరంగ లేఖ రాశారు. తనతో ఐదు నిమిషాలు మాట్లాడి, దాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం సమంజసం కాదన్నారు. రాహుల్ గాంధీ మంగళవారం రోజు గోవా సీఎం మనోహర్ పారికర్‌ను కలిశారు. ఆయన అనారోగ్యానికి చికిత్స తీసుకున్న తర్వాత వెళ్లి పారికర్‌తో భేటీ అయ్యారు. అయితే, వారిద్దరి మధ్య ఐదు నిమిషాల పాటు చర్చ జరిగింది. అయితే, బుధవారం రోజు ఓ సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ‘నిన్న మనోహర్ పారికర్‌ను కలిశా. ఆయన స్వయంగా చెప్పిందేంటంటే రాఫెల్ డీల్‌ను మార్చేటప్పుడు కనీసం దేశ రక్షణ శాఖ మంత్రికి కూడా చెప్పలేదు’ అని మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, కనీసం రక్షణ శాఖ మంత్రికి కూడా చెప్పలేదని మండిపడ్డారు.

  రాహుల్ గాంధీ కామెంట్స్
  రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై గోవా సీఎం మనోహర్ పారికర్ వెంటనే స్పందించారు. ఓ రెండు పేజీల లేఖను రాశారు. ‘మనిద్దరి భేటీని మీ చిల్లర రాజకీయాల కోసం వాడుకుంటారనుకోలేదు. మన ఐదు నిమిషాల భేటీలో మీరు కనీసం రాఫెల్ గురించి ప్రస్తావించనూ లేదు. దాని గురించి చర్చే రాలేదు. ’ అంటూ లేఖను రిలీజ్ చేశారు.

  మనోహర్ పారికర్ రాసిన లేఖ
  రాహుల్ గాంధీకి మనోహర్ పారికర్ లేఖతో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్‌లో పడిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా బీజేపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేసింది. రాహుల్ గాంధీ చేసిన పనిని చూసి దేశం అసహ్యించుకుంటోందంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మండిపడ్డారు.

  First published:

  Tags: Goa, Manohar parrikar, Rafale Deal, Rahul Gandhi

  ఉత్తమ కథలు