హోమ్ /వార్తలు /national /

Father's day 2020: మహా నాయకుడే కాదు గొప్ప తండ్రి కూడా.. వైఎస్ రాజశేఖర్ F/o జగన్

Father's day 2020: మహా నాయకుడే కాదు గొప్ప తండ్రి కూడా.. వైఎస్ రాజశేఖర్ F/o జగన్

వైఎస్ జగన్‌తో వైఎస్ రాజశేఖర్ రెడ్డి

వైఎస్ జగన్‌తో వైఎస్ రాజశేఖర్ రెడ్డి

Father's Day 2020: ముఖ్య‌మంత్రిగా ఎంత బిజీగా ఉన్న ప్ర‌తి ఆదివారం పులివెందుల‌లో ఉన్న తోట‌లో కుటుంబంతో స‌మ‌యం గ‌డిపేవారు వైఎస్ రాజ‌శేఖర్ రెడ్డి. పిల్ల‌లు కూడా ఎన్ని ప‌నులు ఉన్న ప్ర‌తి ఆదివారం పులివెందుల చేరుకునే వారు.

  (బాలకృష్ణ,న్యూస్ 18 తెలుగు హైదరాబాద్ కరెస్పాండెంట్)

  ఆయన ఒక‌ప్ప‌టి బలమైన ప్రజా నాయకుడు. జాతీయపార్టీకి రాష్ట్రంలో ఉపిరిపోసిన వ్య‌క్తి. వేల కిలోమీట‌ర్ల‌ర పాద‌యాత్ర చేసి జననేతగా పేరందుకున్నారు. ఆ అభిమాన‌మే ఆయ‌న్ని రెండు సార్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిని చేసింది. ఆ విజ‌య‌ప‌రంప‌ర ఇంకా కొన‌సాగేదేమో..! కానీ అనుకోని ప్రమాదంలో త‌నువు చాలించిన మ‌హానాయుకుడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి. ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు వైఎస్ మాటే శాస‌నంగా న‌డిచేది. ఢిల్లీ పెద్ద‌లు కూడా రాజ‌శేఖ‌ర్ రెడ్డికి ఎదురు చెప్పాలంటే ఒక‌టి రెండు సార్లు ఆలోచించే వారు. ఐతే ఢిల్లీ రాజైన త‌ల్లికి కొడుకే అనే సామెత‌లాగా ఎంత పెద్ద నాయుకుడైన ఇద్ద‌రు పిల్ల‌ల‌కు నాన్న‌నే క‌దా..! ఒక మ‌హానాయుకుడుగా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఏంటో మ‌న‌కు తెలుసు. కానీ ఒక నాన్న‌గా రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఇంట్లో ఎలా ఉండేవారు? పిల్ల‌ల‌కు ఎంత స‌మ‌యం కేటాయించేవారో ఈ ఫాదర్స్ డే రోజున గుర్తు చేసుకుందాం.

  ముఖ్య‌మంత్రి అంటే రోజులో ఉన్న 24 గంట‌లు స‌రిపోని ప‌ద‌వి. రాష్ట్ర వ్యవ‌హారాల‌తోపాటు అధికారుల స‌మ‌న్వ‌యం.. ఇలా ప్ర‌తి నిముషం బిజీ,బిజీ. అయితే ఇంత‌టి బిజీ టైంలో కూడా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఫ్యామీలికి చాలా మంచి స‌మ‌యాన్ని కేటాయించేవారు అంటారు ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితులు. ఒక లీడ‌ర్ గా పిల్ల‌ల్లో లీడ‌ర్ షిప్ క్యాలీటీస్ పెంచ‌డంలో రాజ‌శేఖర్ రెడ్డి కీల‌క పాత్ర షోషించారు. ముఖ్యంగా పిల్ల‌లకు ఏం కావాలో కాకుండా ఏది మంచో ఏది చెడో.. వాళ్లే తెలుసుకునేలా చిన్న‌తనం నుంచే జీవిత పాఠాలు నేర్పించారు. ఒక తండ్రిగా పిల్ల‌ల ఎదుగుదల‌లో ప్ర‌తిచోట త‌న ప‌ద‌విని కాని త‌న హోదాను కాని అడ్డ‌పెట్టుకొని పూల పాన్పులపై పెంచలేదు. ఆయ‌న క‌ష్టం విలువ తెలిసేలా వారిని పెంచారు. అదే మ‌నం ఇప్పుడు ష‌ర్మిళ‌లో కావ‌చ్చు వైఎస్ జ‌గ‌న్ మోహాన్ రెడ్డిలో కావ‌చ్చు చూస్తున్నాం. అప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు మిత్రులుగా ఉన్న వాళ్లే .. ప‌ద‌వుల కోసం త‌మ‌కు శ‌త్రువులుగా మారితే ఎదురునిల‌బ‌డి పోరాడే ధైర్యం ఆనాడే త‌మ పిల్ల‌ల‌కు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నేర్పించారన‌డంలో సందేహం లేదు. ఆ ప‌ట్టుద‌లే... ఆ ధైర్య‌మే.. వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డికి ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీకి రాని మెజార్టీని సాధించారు.

  వైఎస్ జగన్‌తో రాజశేఖర్ రెడ్డి

  2009 ఎన్నిక‌ల్లో క‌డ‌ప నుంచి ఎంపీగా వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డిని ప్ర‌జ‌ల‌కు ప‌రియ‌చం చేశారు రాజ‌శేఖ‌ర్ రెడ్డి. నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్న అని జగన్ రాజ‌కీయ భవిష్య‌త్ ను ప్ర‌జ‌ల‌కే వ‌దిలేశారు. తండ్రిగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న కొడుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రాజ‌కీయ పాఠాలు తొలినాళ్ల‌లోనే నేర్పారు. 2009లో దాదాపు 4 ల‌క్ష‌ల మెజార్టీతో తొలిసారి ఎంపీగా గెలిచి జగన్ రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. జ‌గ‌న్ రాజ‌కీయ అరంగ్రేటం కూడా త‌న తండ్రి ద్వారే జ‌రిగింది.

  రోజూ ఇద్ద‌రు పిల్ల‌ల‌తోనూ మాట్లాడాల్సిందే.

  ముఖ్య‌మంత్రిగా ఎంత బిజీగా ఉన్న ప్ర‌తిరోజు రాత్రి పిల్ల‌ల‌తో మాట్లాడ‌కుండా వెఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిద్రపోయే వారు కాదు. కొన్ని ప‌నుల రిత్యా జ‌గ‌న్ మోహాన్ రెడ్డి , ష‌ర్మిళ బెంగ‌ళూర్‌లో ఉన్న స‌మ‌యంలో ప్ర‌తిరోజు వాళ్ల‌తో వీడియో కాల్స్‌లో మాట్లాడేవారు.

  ప్రతి ఆదివారం ఆ తోట‌లోనే..

  ముఖ్య‌మంత్రిగా ఎంత బిజీగా ఉన్న ప్ర‌తి ఆదివారం పులివెందుల‌లో ఉన్న తోట‌లో కుటుంబంతో స‌మ‌యం గ‌డిపేవారు వైఎస్ రాజ‌శేఖర్ రెడ్డి. పిల్ల‌లు కూడా ఎన్ని ప‌నులు ఉన్నా ప్ర‌తి ఆదివారం పులివెందుల చేరుకునే వారు. కుటుంబం మొత్తం ఆదివారమంతా అదే తోట‌లో గ‌డిపేవారు. ఎంతో ముఖ్య‌మైన స‌మావేశాలు ఉంటే త‌ప్ప ఆ రోజున పిల్ల‌ల‌కు క‌ల‌వ‌డం వాయిదా వేసేవారు కాదు రాజ‌శేఖ‌ర్ రెడ్డి. పిల్ల‌ల పట్ల అంత అనురాగంగా ఆయన ఉండేవారు.

  నా కొడుకు త‌ప్పు చేస్తే నేనే జైల్లో వేస్తా

  2009 ఎన్నిక‌ల గెలుపు త‌రువాత నిర్వ‌హించిన తొలి అసెంబ్లీలో అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేతగా ఉన్న చంద్ర‌బాబు నాయుడు.. జ‌గ‌న్ మోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. జ‌గ‌న్ త‌న తండ్రి ప‌ద‌విని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని విమర్శించారు. దీంతో నిండు స‌భ‌లోనే చంద్ర‌బాబుకు స‌వాల్ విసిరారు వైఎస్. తన కొడుకుపై విచార‌ణ జ‌రిపించ‌డానికి తాను సిద్ద‌మ‌ని.. ఒక వేళ విచార‌ణ‌లో త‌ప్పుచేసిన‌ట్లు వ‌స్తే జైలుకు కూడా పంపిస్తానని స్పష్టం చేశారు. మీరు చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వాలని తెలితే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటారా అని సవాల్ చేశారు. దాంతో స‌భ‌లో ఒక్క‌సారిగా నిశ‌బ్దం ఆవహించింది. త‌న పిల్ల‌ల ప‌ట్ల వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎంత న‌మ్మ‌క‌మో ఈ ఒక్క ఉదాహర‌ణ చాలంటారు ఆయ‌న స‌న్నిహితులు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, Fathers Day, Fathers Day 2020, Ys jagan

  ఉత్తమ కథలు