హోమ్ /వార్తలు /national /

ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు షోకాజ్ అంటూ ఫేక్ న్యూస్...

ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు షోకాజ్ అంటూ ఫేక్ న్యూస్...

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు పవన్ కళ్యాణ్ షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు ఫేక్ న్యూస్ ప్రచారం అయింది.

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చినట్టు ఫేక్ న్యూస్ ప్రచారం అయింది. ఈ రోజు కాకినాడలో జరిగిన రైతు సౌభాగ్య దీక్షకు హాజరుకాకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ జారీచేసినట్టు ప్రచారం జరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనకు నోటీస్ జారీ చేసినట్టు కొందరు ప్రచారం చేశారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఇంగ్లీష్ మీడియం అంశం మీద చర్చ జరిగింది. ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, జనసేన పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం జగన్ నిర్ణయాన్ని సమర్థించారు. ఓ దళితుడిగా పేదలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలన్న అంశాన్ని తాను స్వాగతిస్తానన్నారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మీద జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కామెంట్లు చేస్తున్నా రాపాక కౌంటర్ ఇవ్వడం లేదనే అభిప్రాయం జనసేన వర్గాల్లో నెలకొంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసే పార్టీ తరఫున ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలుపొందారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. అయితే, కాకినాడలోనే జరిగిన రైతు సౌభాగ్య దీక్షకు రాపాక హాజరుకాకపోవడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

First published:

Tags: Andhra Pradesh, Janasena party, Pawan kalyan, Rapaka varaprasad

ఉత్తమ కథలు