హోమ్ /వార్తలు /national /

Dubbaka By election: దుబ్బాక ఎగ్జిట్ పోల్స్‌.. టీఆర్ఎస్‌కు బీజేపీ షాక్ ఇస్తుందా ?

Dubbaka By election: దుబ్బాక ఎగ్జిట్ పోల్స్‌.. టీఆర్ఎస్‌కు బీజేపీ షాక్ ఇస్తుందా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dubbaka by election exit polls: దుబ్బాక ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఓ సంస్థ బీజేపీ గెలుస్తుందని పేర్కొనగా... మరో సంస్థ టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని వెల్లడించింది.

  ఉప ఎన్నికలు ముగిశాయి. సాధారణ ఎన్నికల స్థాయిలో పోలింగ్ శాతం కూడా నమోదైంది. ఎన్నికలు ముగియడంతో.. ఇక అందరి చూపు ఫలితాలపైనే పడింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో ఉండగా.. పలు సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఆసక్తి రేపుతున్నాయి. పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మాత్రం బీజేపీ విజయం సాధించబోతున్నట్లు వెల్లడించింది. 47 శాతం ఓట్లతో బీజేపీకి మొదటి స్థానం రానున్నట్లు పేర్కొంది. తర్వాత 38 శాతం ఓట్లతో టీఆర్ఎస్‌కు రెండోస్థానం, కాంగ్రెస్‌కు 13 శాతం ఓట్లు రానున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది.

  ఇక థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ (నాగన్న) సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో టీఆర్ఎస్ విజయభేరీ మోగిస్తుందని అభిప్రాయపడింది. 51-54 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు తొలిస్థానంలో ఉంటుందని.. 33-36 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు రెండోస్థానం నిలుస్తాడని పేర్కొంది. 8-11 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి మూడోస్థానం లభించనున్నట్లు పేర్కొంది. ఎగ్జిట్ పోల్స్‌లోనూ టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఉండటంతో... దుబ్బాకలో గెలుపు ఎవరిది అనేది తెలియాలంటే.. ఓట్ల లెక్కింపు జరిగే పదో తేదీ వరకు ఆగాల్సిందే.

  దుబ్బాక ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగానే తలపడ్డాయి. టీఆర్ఎస్‌ నుంచి సోలిపేట సుజాత పోటీ చేయగా.. బీజేపీ తరపున రఘునందన్ రావు బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ నుంచి మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ దూకుడు ప్రదర్శించగా... కాంగ్రెస్ మాత్రం ఆ విషయంలో కొంత వెనుకబడిందనే వాదనలు వినిపించాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana

  ఉత్తమ కథలు