హోమ్ /వార్తలు /national /

Undavalli Arunkumar: పేదవాళ్ల కోసం మాట్లాడే వారిని కాల్చి చంపేస్తారు: ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Undavalli Arunkumar: పేదవాళ్ల కోసం మాట్లాడే వారిని కాల్చి చంపేస్తారు: ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

ఉండవల్లి అరుణ్ కుమార్ (ఫైల్ ఫోటో)

ఉండవల్లి అరుణ్ కుమార్ (ఫైల్ ఫోటో)

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మనకెందుకులే అని అందరూ వదిలిస్తే భవిష్యత్తులో పేదల గురించి మాట్లాడేవారిని కాల్చి చంపేసే పరిస్థితి వస్తుందన్నారు.. ఇప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ దేశంలో జరుగుతున్న ఈ ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకించాలని పిలుపు ఇచ్చారు.

ఇంకా చదవండి ...

ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేకపోయినా ఆయన వ్యాఖ్యలు మాత్రం చాలా పదునుగా ఉంటాయి..  చెప్పాల్సింది సుత్తి లేకుండా షూటిగా చెబుతారు. అందుకే ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అవి హైలైట్ అవుతూ ఉంటాయి. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో భాగంగా ఈ నెల 26న భారత్ బంద్ కు పిలుపు ఇచ్చాయి కమ్యూనిస్టు పార్టీలు.  ఈ బంద్ కు సహకరించాలని మాజీ  ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కోరారు కమ్యూనిస్టు  నేతలు.. స్టీల్ ప్లాంట్ కు మద్దతుతుగా జరుగుతున్న బంద్ కు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాని ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత దేశంలో కమ్యూనిస్టులు లేకుంటే.. పేదల సమస్యల గురించి మాట్లాడే రాజకీయ పార్టీలు కనుమరుగై పోతాయి అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండడతోనే కమ్యూనిస్టులను వ్యతిరేకించాల్సి వచ్చేది అన్నారు. అయితే తాను కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వ్యతిరేకమే అయినా.. వారి నిబద్ధతను ఎప్పుడూ ప్రశంసిస్తూ ఉంటాను అన్నారు. అలాగే ప్రధాని మోదీ పాలనలో దేశంలో ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీలో రైతులు ధర్నా సమయంలో.. సాగు చట్టాల్లో పంటకు గిట్టు బాటు ధర క ల్పిస్తున్నట్టు చట్టం చేయమని అడిగితే.. కేంద్రం అందుకు  ఒప్పుకోవడం లేదని.. కానీ కొత్త వ్యవసాయ చట్టాల్లో ఆ అంశం ఉందని మాత్రం చెబుతోందని ఆరోపించారు. అంటే ప్రైవేటు వ్యక్తుల్లోకి వ్యవసాయం వెళ్లాక రైతులు ఇంకేం ప్రశ్నిస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  కేవలం మోదీ మాత్రమే కాదు.. బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే అది అన్నారు.

2104 మార్చి 31 నాటికి భారత దేశం అప్పు  46 లక్షల కోట్ల రూపాయలు ఉంటే.. ప్రధాని మోదీ దాన్ని 2020 డిసెంబర్ నాటికి 1 కోటి 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు పెంచారని.. అంటే భారత దేశ పంచ వర్ష ప్రణాళికలు ప్రారంభైమైనప్పటి నుంచి 2014 వరకు అయిన అప్పుడు 46 లక్షల కోట్లు అయితే.. దాన్ని ఈ ఆరేళ్ల కాలంలో రెట్టింపు చేశారని మండిపడ్డారు. అప్పులు పెరిగినా భయం లేదు ఆస్తులు పెంచుతున్నారు అనుకుంటే అదే లేదన్నారు. ఉన్న ప్రభుత్వ సంస్థలు అన్నింటినీ అమ్మేస్తున్నారని మండిపడ్డారు.

ఇలాంటి అంశాలను పార్లమెంట్ లో ఎంపీలు ప్రశ్నిస్తారని.. ఆన్ లైన్ లో చట్టాలు చేయడం దారుణమన్నారు. మన రాజ్యాంగంలో సోషలిస్ట్ అనే పదం ఉండగా.. ప్రభుత్వ రంగ సంస్థలను ఎలా ప్రైవేటీకరణ చేస్తారని.. దీనిపై కమ్యూనిస్టు పార్టీలు గట్టిగా పోరాడాలి అని పిలుపు ఇచ్చారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ పెట్టుబడీ దారి నిర్ణయాలను వ్యతిరేకించాలని పిలుపు ఇఛ్చారు. కానీ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు పెట్టుబడి దారుల చేతుల్లో ఉండడంతో.. వారు మోదీని ప్రశ్నించడానికి భయపడుతున్నారని అభిప్రాయపడ్డారు.  ఒకవేళ ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు భయపడి ఒప్పుకోకూడదనన్నారు. అలా సమర్ధిస్తే తమది కూడా పెట్టుబడీ దారి పార్టీగా ప్రకటించుకోవాలని కోరారు. అలా ప్రకటించుకుని ఎన్నికలకు వెళ్తే ప్రజలే సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఏది ఏమైనా ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అతి పెద్ద భయంకరమైన మార్పు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి నిర్ణయాలను మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రైవేటీకరణలను పూర్తిగా సమర్ధిస్తే.. దేశం మొత్తం పెట్టుబడి దారుల చేతుల్లోకి వెళ్లిపోతుందని.. అదే జరిగితే.. ప్రస్తుతం కార్పొరేట్ వ్యక్తులు అప్పులు చేసి.. అక్కడ దాక్కున్నారు.. ఇక్కడ దాక్కున్నారని మనం వార్తలు వింటున్నామని.. కానీ రేపు మొత్తం దేశం ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తే.. పేదల గురించి మాట్లాడే వారు కనిపిస్తే కాల్చి చంపే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి అంటూ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Narendra modi, Pm modi, Undavalli Arun Kumar, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant

ఉత్తమ కథలు