హోమ్ /వార్తలు /national /

VisakhaPatnam: జగన్ కు జైలు కొత్త కాదు? అక్కడ నుంచే పాలించాలి.. ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

VisakhaPatnam: జగన్ కు జైలు కొత్త కాదు? అక్కడ నుంచే పాలించాలి.. ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

ఉండవల్లి అరుణ్ కుమార్ (ఫైల్ ఫోటో)

ఉండవల్లి అరుణ్ కుమార్ (ఫైల్ ఫోటో)

ఏపీ సీఎం జగన్ జైలుకు వెళ్తారా? ఒక వేళ జైలుకు వెళ్తే అక్కడ నుంచే పరిపాలిస్తారా? నిజంగానే ప్రధాని మోదీని చూసి సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ భయపడుతున్నారా? ఈ వ్యాఖ్యలు చేస్తోంది ఎవరో కాదు ఉండవల్లి అరుణ్ కుమార్.

ఉండవల్లి అరుణ్ కుమార్ (undavalli arun kumar ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (cm ys jagan mohan reddy)కి  జైలుకు వెళ్లడం కొత్త కాదని.. ఒక వేళ జైలుకు వెళ్లాల్సి వచ్చినా జైలు నుంచే పరిపాలించవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రధాని మోదీని చూసి జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబులు ఎందుకు భయపడుతున్నారో తెలియడం లేదని.. జగన్ ను అరెస్ట్ చేసేంత సాహసం కేంద్రం చేయదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా విశాఖ (visakhapatnam steel plant)ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. తాజాగా విశాఖ ఆర్కే బీచ్ (rk beach)లో కార్మిక సంఘాలు, నిర్వాసితులు సమైక్యంగా బీచ్ వాక్(beach walk)పేరుతో నిరసన ర్యాలీని నిర్వహించాయి. కార్మిక కవాతు పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా స్పందన వచ్చింది. కార్మిక, ప్రజా, విద్యార్థి సంఘాలతో పాటు నిరసన ప్రదర్శనకు రాజకీయ నేతలు కూడా సంఘీభావం ప్రకటించారు. ఇప్పటికే విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపిన ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తాం లేదా మూసేస్తాం అంటూ కేంద్రం మాట్లాడడం సరైన నిర్ణయం కాదన్నారు. ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ సంస్థలు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై పార్లమెంట్ లో చర్చ పెట్టాలన్న ఆయన టీడీపీ, (telugu desam party) వైసీపీ (ysrcp)ఎంపీలు ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించాలని.. లేదంటే ప్రజాగ్రహం చవి చూడక తప్పదన్నారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే హక్కు ప్రభుత్వానికి లేదని అన్నారు. ఆర్ కార్డ్ ఇచ్చిన వారికి ఇప్పటికి ఉద్యోగాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు సుమారు 7000 మంది ఉన్నారని.. మరి ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే వారి జీవితాలు ఏం కావాలని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ను అమ్మడం ఒక తప్పని.. అమ్మితే తమకే అమ్మండని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రత్యేక చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. కలసి వచ్చే ఎంపీలతో పార్లమెంట్ లో పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పిలుపు ఇచ్చారు. ఏపీని కాదని పాండిచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పడం.. ఏంటని.. ఇంకా బీజేపీ ఎవరిని మోసం చేయాలి అనుకుంటోందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని చూసి సీఎం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఏపీ ప్రజలు చాలా నమ్మకంతో జగన్ మోహన్ రెడ్డికి భారీ మెజార్టీ ఇచ్చారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత జగన్ పై ఉందన్నారు. ఒకవేళ కేసులకు భయపడితే జగన్ కు జైలుకు వెళ్లడం కొత్తకాదు కదా అన్నారు. ఒక వేళ జైలుకు వెళ్లాల్సి వచ్చినా అక్కడ నుంచే పరిపాలించాలన్నారు. కానీ జగన్ ను అరెస్ట్ చేసేంత ధైర్యం కేంద్ర ప్రభుత్వం చేయదు అన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Chandrababu Naidu, Pm modi, Undavalli Arun Kumar, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant, Ys jagan

ఉత్తమ కథలు