హోమ్ /వార్తలు /national /

Raghuveera Reddy: రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్న రఘువీరా.. ఆయన దారెటు..?

Raghuveera Reddy: రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్న రఘువీరా.. ఆయన దారెటు..?

రఘువీరారెడ్డి దారెటు

రఘువీరారెడ్డి దారెటు

ఒకప్పుడు సీఎం రేసులో ఉన్న నేత సడెన్ గా రాజకీయ అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారు..? రాజకీయాలు బోర్ కొట్టాయా..? ఇక నెగ్గుకు రాలేను అనుకున్నారా..? అతి సామాన్యుడిలా సొంత ఊరికే ఎందుకు పరిమితం అయ్యారు.. మళ్లీ ఇప్పుడు ఆయన చుట్టూ రాజకీయ నేతలు ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు..? ఆయన దారెటు..?

ఇంకా చదవండి ...

M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి,  న్యూస్18                 కాంగ్రెస్ పార్టీ హయాంలో అయన ఓ వెలుగు వెలిగారు. అనంతపురం రాజకీయాల్లో కీలక నేతగా పావులు కదిపారు..కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా ఎదిగి వైఎస్ మరణం తరువాత సీఎం రేసులో ఉన్న వ్యక్తి రఘువీరా రెడ్డి. రాష్ట్ర బిభజన తరువాత కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రెండు భుజాలపై పార్టీని మోస్తూ కృషి చేసారు. కానీ తరువాత రాష్ట్రంలో పరిణామాలఅతో.. రాజకీయంగా బోరు కొట్టిందో లేక విరక్తి చెందారో తెలియదు కానీ కంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమైయ్యారు. గత రెండేళ్లుగా నీలకంఠ పురంలోనే ఉంటూ సామాన్య రైతులా కనిపిస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిచయాలు బలంగా ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం అనేక సీనియర్ నేతలు పార్టీని వీడిన అయన మాత్రం దైర్యం కోల్పోలేదు. 2019లో పీసీసీ అధ్యక్షా పదవికి రాజీనామా చేసారు. నీలకంఠ పురంలో ఆలయ నిర్మాణానికి సంకల్పించి.. సొంత గ్రామానికే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణం కొలిక్కి తెచ్చారు. ఆలయం పూర్తి కావడంతో కొంత విశ్రాంతిలో ఉన్నా అయనకు.. ఒక్కపుడు రాజకీయాల్లో క్షణం తీరిక ఉండేది కాదు. పగటిపూట ఆలయ నిర్మాణం., వ్యవసాయం తప్ప వేరొక పనిపై ద్యాస పెట్టె వారు కాదు. తలపాగా చుట్టి. పంచ కట్టుతో తెల్లటి గడ్డంతో టీవీఎస్ ఫిఫ్టీ పై ఆలా ఊరిలో తిరుగుతూ పెద్దలతో., అభిమానులతో సరదాగా గడిపేస్తున్నారు. అయన అభిమానులకు ఓ కొత్త లుక్ ను పరిచయం చేసారు రఘువీరారెడ్డి. పంచాయితీ ఎన్నికల్లో టీవీఎస్ ఫిఫ్టీ వాహనంపై భార్యను కుర్చోబెట్టుకొని ఓటు వేసేదుకు పోలింగ్ కేంద్రంకు వచ్చిన జాతీయ అందర్నీ ఆకట్టుకున్నారు. ప్రతిరోజూ సాయంత్రం కాగానే రచ్చబండపై గ్రామంలోని స్నేహితులు పెద్దలతో సమావేశంకావడం., వారితో ముచ్చట్లు పెట్టుకోవడం అయన దినచర్యగా మారింది.

అయితే అయన పెట్టుకున్న సంకల్పం పూర్తి కావడంతో....ఇకపై రఘువీరా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా....లేక సైలెంట్ గా ఉండిపోతారా అన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవలి కాలంలో అనేక మంది కాంగ్రెస్ నేతలు రఘవీరా రెడ్డిని కలసి వెళ్తున్నారు. ఢిల్లీ పెద్దల నుంచి  కూడా పిలుపు వచ్చింది. అయితే అయన నిర్మించిన ఆలయంలో 15 రోజుల పాటు చేపట్టిల్సిన హోమాలు., యాగాలు ఉన్నాయి. దీంతో ఆయన ఢిల్లీ వెళ్తారో లేదో అన్నదానిపై క్లారిటీ రావడం లేదు. అయన ఢిల్లీ వెళ్తారో లేదో  చూడాలి. ఒకవేళ ఢిల్లీ వెళ్తే మళ్లీల కాంగ్రెస్  పటిష్టతపై ఫోకస్ చేయొచ్చు.. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి..

ప్రస్తుతం ఆయన పొలిటికల్ గా చురుగ్గా లేకపోయినా ఇతర పార్టీ నేతలు చాలామంది వచ్చి ఆయనను కలసి వెళ్తున్నారు. కాంగ్రెస్ లోని పాత మిత్రుడు.. ప్రస్తుత టీడీపీ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మంచి మిత్రుడు. ఆలయ సందర్శనానికి నీలకంఠాపురం వచ్చిన జేసీ..రఘవీరా తో పాత జ్ఞాపాలకు నెమరు వేసుకున్నారు. అదే సమయంలో రాయలసీమ జలాల కోసం కలసి పోరాటాలుచేద్దామని కోరినట్నటు తెలిసంది. కానీ ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు అంటున్నారు జేసీ. బయటకు ఆ పేరు చెబుతున్నా.. ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించడానికే ప్రభాకర్ రెడ్డి వెళ్లారనే చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటికే చంద్రబాబు అనుమతి కూడా తీసుకున్నట్టు పొలిటికల్ టాక్. మరి రఘువీరా రెడ్డి మదిలో ఏం ఉందో తెలియాలి అంటే మరికొంత కాలం వేచి చూడక తప్పేలా లేదు.  దే సమయంలో ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ లో కదలికలు రావడం మొదలైయ్యాయి. దింతో అందరి ద్రుష్టి రఘువీరాపై పడింది. ఈ సీనియర్ నాయకుడు మల్లి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? లేదా..? అనే అంశం పై తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది.

First published:

Tags: Andhra Pradesh, AP Congress, AP News, AP Politics, Jc prabhakar reddy, Raghuveera Reddy, TDP, Ycp

ఉత్తమ కథలు