కరోనా నేపథ్యంలో ఇల్లు దాటి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని, ప్రతి పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. జి.కొండూరు మండలంలోని చెరువు మాధవరం, ఛేగిరెడ్డిపాడు, కందులపాడు, ముత్యాలంపాడు, ఆత్కూరు గ్రామాల్లో.. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గుంటుపల్లి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల ఆర్థిక సహకారంతో ఆయా గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి నిత్యవసరవస్తువులు, కూరగాయలు, బియ్యం, కోడిగుడ్లను పంపిణీ చేశారు. పేదలు ఈ సమయంలో రూపాయి కూడా సంపాదించుకోలేరు కాబట్టి మూడు నెలలకు సరిపోయే విధంగా నిత్యవసరాలు అందించి, ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో శనగలు దానం చేస్తే పుణ్యం రాదని, కందిపప్పు ఇస్తే ఉపయోగపడుతుందని, ఎవరో సాములోరు చెప్పారని శనగలు ఇవ్వద్దని, సి.హెచ్ మాధవరంలో పార్వతి అనే సామాన్య గృహిణికి ఉన్నపాటి జ్ఞానం కూడా శనగలు అందజేసే ప్రభుత్వానికి అధికారులకు లేకుండా పోయిందని ఆరోపించారు.
పులివెందుల అరటిపళ్లు తెచ్చి డ్వాక్రా మహిళలతో 20 నుంచి 25 రూపాయలు వసూలు చేస్తున్నారని ధారావత్ శ్రీను అనే వ్యక్తి ఉమా దృష్టికి తీసుకురాగా గతంలో ఇదే డ్వాక్రా సంఘాల ద్వారా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయించామని ఇప్పడాపని ప్రభుత్వం ఎందుకు చేయించలేకపోతుందని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల మద్య సమన్వయం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి డ్వాక్రా సంఘాల ద్వారా మామిడిని కొనుగోలు చేయించాలని కోరారు. లాక్డౌన్ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలను, రైతులను ఆదుకోవాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Devineni uma, Ration card