హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Meghalaya: కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. మాజీ సీఎంతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు జంప్

Meghalaya: కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. మాజీ సీఎంతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు జంప్

ముకుల్ సంగ్మా

ముకుల్ సంగ్మా

Meghalaya Congress Crisis: విన్సెంట్ పాలా పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ముకుల్ సంగ్మా అసంతృప్తితో ఉన్నారు. తనను సంప్రదించకుండనే పాలను పీసీసీ చీఫ్‌గా నియమించారని గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడారు.

కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మేఘాలయా కాంగ్రెస్‌ (Meghalaya Congress) పార్టీలో భారీ కుదుపు చోటుచేసుకుంది. రాత్రికి రాత్రి రాజకీయం మారిపోయింది. మాజీ సీఎం ముకుల్ సంగ్మా (Mukul Sangma)తో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. వారంతా బుధవారం అర్ధరాత్రి తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congresss) పార్టీలో చేరారు. టీఎంసీ పార్టీ నేతలు ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న 17 ఎమ్మెల్యేల్లో 12 మంది టీఎంసీలో చేరడంతో.. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ మార్పు గురించి CNN-News18తో మాట్లాడిన ముకుల్ సంగ్మా.. ఈ విషయం గురించి ఇప్పుడేమీ మాట్లాడలేనని, శుక్రవారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించి అన్ని వివరాలను మీడియాకు వెల్లడిస్తానని పేర్కొన్నారు.

టీఎంసీలో చేరికకు సంబంధించి వీరంతా ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్‌ మెట్బా లింగ్డాకు లేఖ రాసినట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది గరో హిల్స్, నలుగురు ఖాసి జైంతియా హిల్స్‌‌కు చెందిన వారు ఉన్నారు. ఇక మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత ముకుల్ సంగ్మా గరో హిల్స్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీఎంసీలో ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు చేరడంతో.. ఇప్పుడు ఆ పార్టీ రాత్రికి రాత్రే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. మొత్తం 60 సీట్లు ఉన్న అసెంబ్లీకీ 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పటికే నలుగురు పార్టీకి గుడ్‌బై చెప్పారు. తాజాగా మరో 12 మంది వీడారు. ఈ నేపథ్యంలో మేఘాలయా అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ బలం 5కి పడిపోయింది. 2023లో రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో టీఎంసీ బలమైన పోటీఇచ్చే అవకాశం ఉంది.

Odisha CM Convoy: ఒడిషాలో హీటెక్కిన రాజకీయం.. సీఎం కాన్వాయ్ పై బీజేవైఎం కోడి గుడ్ల దాడి..

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న తృణమూల్ కాంగ్రెస్.. ఈశాన్య రాష్ట్రాల్లో తన బలం పెంచుకోవడంపై దృష్టి సారిస్తోంది. ఈక్రమంలోనే ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులను పార్టీలో చేర్చకుంటోంది. అంతేకాదు క్షేత్రస్థాయిలోనూ పార్టీని పటిష్టం చేస్తోెంది.

Smriti Irani: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లైఫ్ లో ట్విస్ట్ లు.. మిస్ ఇండియా కాలేక పోయారు

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌పై ముకుల్ సంగ్మా కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఆయన డిమాండ్లను పార్టీ పెద్దలు నెరవేర్చలేదు. నెలక్రితం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సంగ్మా భేటీ అయ్యారు. ఆ సమావేశంలో పార్టీ అధినేత విన్సెంట్ హెచ్ పాలా కూడా పాల్గొన్నారు. విన్సెంట్ పాలా పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సంగ్మా అసంతృప్తితో ఉన్నారు. తనను సంప్రదించకుండనే పాలను పీసీసీ చీఫ్‌గా నియమించారని గుర్రుగా ఉన్నారు. హైకమాండ్ తనను పట్టించుకోవడం లేదని, అందుకే పార్టీ మారాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. మరోవైపు పాల, సంగ్మా మధ్య విభేదాలను తొలగించేందుకు పార్టీ ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది.

Punjab: ఆ మహిళలకు రూ. 1000.. పంజాబ్‌పై కేజ్రీవాల్ హామీ ఎఫెక్ట్ ఎంత ?

అక్టోబర్‌లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)తో ముకుల్ సంగ్మా భేటీ అయ్యారు. మేఘాలయాలో తాజా రాజకీయాలపై చర్చించారు. ఆయన పార్టీ మారతారని అప్పుడే ప్రచారం జరిగింది. కానీ పార్టీ మార్పు గురించి ఆయన ఏమీ మాట్లాడలేదు. ఐతే తాజాగా రాత్రికి రాత్రే పార్టీ మారారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీఎంసీలో చేరారు. మరోవైపు గోవా మాజీ సీఎం ఫెలెరియో కూడా టీఎంసీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది.

మరోవైపు తృణమూల్‌ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మీరు కలుస్తారా..? అని విలేకరులు అడగడంతో లేదు అని ఆమె బదులిచ్చారు. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ సోనియా గాంధీని కలవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మమత బెనర్జీకి మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఎంసీలో చేర్చుకోవడం దేశరాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

First published:

Tags: Congress, Mamata Banerjee, Meghalaya, Trinamool congress

ఉత్తమ కథలు